Sunday, April 19, 2026
Ad Banner

Dacoit: ‘డెకాయిట్‌’ సెన్సార్ పూర్తి

Dacoit (Dacait / Daku / Bandit / Armed Robber) censor complited : అడివి శేష్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతున్న పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్‌’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ […]

Dacoit (Dacait / Daku / Bandit / Armed Robber) censor complited : అడివి శేష్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతున్న పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్‌’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్నాయి.

పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, అలాగే ‘రుబారు’ చిచ్చుబుడ్డి పాటలు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన పొందుతూ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి.ట్రూ బైలింగ్వల్ ప్రాజెక్ట్‌గా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా రెండు భాషల్లో సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా అద్భుతంగా వుందని సెన్సార్ సభ్యులు మూవీ టీంని అభినందించారు.అడివి శేష్ ‘డెకాయిట్‌’ తో డబుల్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి భీమ్స్ బ్లాక్ బస్టర్ అల్బమ్ అందించారు. ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జ్ఞాని నేపథ్య సంగీతం సమకూర్చారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు