Sunday, April 19, 2026
Ad Banner

కమల్ హాసన్ కూడా ఇలాంటి రోల్ చెయ్యలేదేమో : జె డీ చక్రవర్తి

Even Kamal Haasan Might Not Have Done a Role Like This: JD Chakravarthy: ప్రముఖ నటుడు కమల్ హాసన్ యాక్టింగ్ ముందు మనం ఆయన కాళ్ళ గూటికి కూడా సరిపోము. గాయపడ్డ సింహం సినిమాలో నేను చేసిన రోల్ బహుశా కమల్ హస్సన్ కూడా చేసి ఉండదు. ఆయనకు లేని రాని అదృష్టం నాకు వచ్చింది. ఈ రోల్ చెయ్యడం నిజంగా నా అదృష్టం అని నటుడు జె డీ చక్రవర్తి వ్యాఖ్యానించారు. […]

Even Kamal Haasan Might Not Have Done a Role Like This: JD Chakravarthy: ప్రముఖ నటుడు కమల్ హాసన్ యాక్టింగ్ ముందు మనం ఆయన కాళ్ళ గూటికి కూడా సరిపోము. గాయపడ్డ సింహం సినిమాలో నేను చేసిన రోల్ బహుశా కమల్ హస్సన్ కూడా చేసి ఉండదు. ఆయనకు లేని రాని అదృష్టం నాకు వచ్చింది. ఈ రోల్ చెయ్యడం నిజంగా నా అదృష్టం అని నటుడు జె డీ చక్రవర్తి వ్యాఖ్యానించారు. గాయపడ్డ సింహం సినిమాలో అత్యంత కీలకమైన రోల్ పోషించిన జె డీ చక్రవర్తికి సంబంధించిన టీజర్ ను ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేశారు. ఈ సందర్బంగా జె డీ చక్రవర్తి మాట్లాడుతూ ఇంతవరకు తాను చేసిన పాత్రల్లో ఇది మాత్రం చాలా డిఫరెంట్ రోల్ అని అన్నారు.

ఒక్కో క్యారెక్టర్ కు ఒక్కో ప్రత్యేకత ఉంటుందని చెప్పారు. పవన్ సాదినేనితో ఇంతకు ముందు చేసిన దయ సినిమా కంటే కూడా ఈ క్యారెక్టర్ చాలా గొప్పగా ఉంటుందని చెప్పారు. ఈ క్యారెక్టర్ లో వేరియేషన్స్ ఉంటాయి. కమల్ లాంటి నటుడు కూడా చేయనటువంటి గొప్ప క్యారెక్టర్ ఇది. మని, అనగనగా ఒక రోజు అలాంటి సినిమా అవుతుంది. మైల్ స్టోన్ సినిమా అవుతుంది.

ఇది ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం అవుతుంది అన్నారు. ఈ సినిమా వెనుకాల మొత్తం పవన్ సాధినేని నడిపించాడు. కథ , దర్శకుడు కశ్యప్ చెప్పిన కథ నచ్చి పవన్ ఈ సినిమా ప్రారంభం చేశాడు. ఇది పూర్తిగా దర్శకుల సినిమా. నేను, పవన్, భాను, కశ్యప్ ఇలా అందరూ దర్శకులే కలసి చేసిన సినిమా. అందరూ దర్శకులే అయినప్పటికీ గాయపడ్డ సింహం సినిమా దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ చెప్పినట్టే చేశాము మేము ఎవరు కూడా ఇన్వాల్వ్ కాలేదు అని చెప్పారు.

#JDChakravarthy#KamalHaasan
#TeluguCinema
#IndianCinema
#ActorPerformance
#MovieDialogue
#Tollywood
#CinemaLovers
#FilmDiscussion
#ActingSkills
#JDChakravarthy
#KamalHaasan
#TeluguCinema
#IndianCinema
#ActorPerformance
#MovieDialogue
#Tollywood
#CinemaLovers
#FilmDiscussion
#ActingSkills

కశ్యప్ చాలా గొప్పగా రాస్తాడు. యూనివర్సల్ కామెడీ ఉంటుంది. సినిమా చూస్తుండగా నవ్వుకుంటాము, చూసినాక నవ్వుకుంటాము, ఈ సినిమాలోని సీన్స్ గుర్తుకు వస్తే కూడా నవ్వుకుంటాము అని జేడీ చెప్పారు. దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ మాట్లాడుతూ జేడీ దగ్గరి నుంచి చాలా నేర్చుకున్నాను అని అన్నారు. కార్ వ్యాన్ దూరంగా ఉంటె షూటింగ్ స్థలంలోనే అయిదు నిమిషాల్లో డ్రెస్ మార్చుకుని రెడీ అయిన జేడీ గురించి ఎంత చెప్పిన తక్కువే నాని అన్నారు.

మే 1వ తేదీన విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతల్లో ఒకరైన పవన్ సాధినేని అన్నారు. ఒకవేళ రామ్ చరణ్ పెద్ది ఈ నెల 30కి వస్తే వారం రోజుల పాటు తమ సినిమా విడుదల వాయిదా వేసుకుంటామని చెప్పారు. నిర్మాత భాను కిరణ్ ప్రతాప కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు