Sunday, April 19, 2026
Ad Banner

‘డెకాయిట్’ యాక్షన్ థ్రిల్ చేస్తుంది: చిట్ చాట్ లో అడివి శేష్

“Adivi Sesh Talks About ‘Dacoit’ – Action Thriller Buzz: బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్‌’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ […]

“Adivi Sesh Talks About ‘Dacoit’ – Action Thriller Buzz: బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్‌’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ,పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డెకాయిట్‌ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరో అడివి శేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

  • డెకాయిట్ తెలుగు ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. హిందీ రెస్పాన్స్ ఎలా ఉంది?
    హిందీలో చాలా అద్భుతంగా ఉంది. హిందీలో మేము ఊహించిన దాని కంటే చాలా చక్కని రీచ్ ఉంది. ఫస్ట్ టైం భోజ్ పురి లో కూడా ప్రీమియర్ చేస్తారా అని అడిగారు. అది విన్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. పవన్ సింగ్ గారు ఇందులో చేయడం భోజ్ పురికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
  • మీ గత సినిమాల్లో కూడా ప్రేమ కథలు ఉన్నాయి కానీ.. ఈ ప్రేమ కథకి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి?
    నా గత సినిమాల్లో ఒక బిగ్ ప్లాట్ఫామ్ చేరుకోవడానికి లవ్ స్టోరీ వుంటుంది. కథలో ఒక చిన్న భాగంగా ఉంటుంది. కానీ ఈ సినిమాలో లవ్ స్టోరీ నే మెయిన్ ప్లాట్ ఫామ్.ఈ మొత్తం సినిమాకి లవ్ స్టోరీయే కారణం. ఒక లవ్ స్టోరీ లో యాక్షన్ చూడ్డానికి వెళ్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక యాక్షన్ సినిమాలో లవ్ చూడడానికి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఇందులో ఎమోషన్స్ అన్నీ కూడా ఆర్గానిక్ గా ఉంటాయి.
  • ఈ కథకు ఏదైనా స్ఫూర్తి ఉందా?
    ఒకరోజు ఒక విజువల్ మెటాఫర్ నా మైండ్ లోకి వచ్చింది. ‘ఒక బిజీ రోడ్డుపైన ఒక కాంక్రీట్ సిమెంట్ ఫుట్ పాత్ క్రాక్ నుంచి ఒక చిన్న పువ్వు బయటికి వస్తే’…ఈ విజువల్ ఇమాజినేషన్ నుంచి ఈ కథ మొదలైంది. ఒక ఇంటెన్స్ యాంగర్ యాక్షన్ మధ్యలో మధ్యలో లవ్ స్టోరీ తయారు చేశాం.
  • మీరు ఇప్పటివరకు స్క్రీన్ మీద డాన్స్ చేయలేదు. ఈ సినిమాతో మొదలుపెట్టారు దీనికి కారణమేదైనా ఉందా?
    -చిన్నప్పుడు ఫంక్షన్ లో డాన్స్ చేస్తున్నప్పుడు నువ్వు చాలా పొడుగ్గా ఉన్నావు డాన్స్ చేయొద్దు ఎవరో అన్నారు అప్పటినుంచి ఆ ఫీలింగ్ ఎలా ఉండిపోయింది. నాకు నేనే ఆ లిమిట్ పెట్టుకున్నాను. కానీ ఈ సినిమా కోసం ఆ లిమిటేషన్ దాటాను. ఇందులో హరి క్యారెక్టర్ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను. తను మొహం మీద మాట్లాడే వ్యక్తి చాలా ఓపెన్ గా ఉండే క్యారెక్టర్. ఈ పాత్ర కోసమే మదనపల్లి యాస ప్రాక్టీస్ చేసి చేసి ఇంట్లో కూడా మాట్లాడటం మొదలు పెట్టాను. నా యాస చూసి మా అమ్మ ‘ఏంటి ఇలా మాట్లాడుతున్నావ్’ అన్నారు.

  • ఈ సినిమా కాస్త డిలే అయింది కదా దీనికి కారణం?
    నిజానికి ఒక డిలే కాలేదు. నేను సినిమా చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది. నా వరకు గత రెండు సంవత్సరాలుగా రోజు ఆగకుండా పనిచేస్తున్నాననే ఉంది. కాకపోతే బయటికి అది రెండు సంవత్సరాలు అయింది కదా అనిపిస్తుంది.వరుసగా సినిమాలు రావాలంటే నేను రైటింగ్ ప్రాసెస్ లో ఉండకూడదు. గూడచారి 2 తర్వాత ఎమోషనల్ గా రీఛార్జ్ అవ్వాలి అనుకుంటున్నా. వేరే వాళ్ళ విజన్ లో వర్క్ చేయాలనుకుంటున్నాను.
  • డాల్బీ లో రిలీజ్ చేయాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది?
    మాకు మొదటి నుంచి సినిమాని డాల్బీలో రిలీజ్ చేయాలని ఉంది. కాకపోతే అల్లు అరవింద్ గారు ఫోన్ చేసి సినిమా చాలా ప్రామిసింగ్ గా ఉంది కొలబరేట్ అవుదాం అని చెప్పారు. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
  • భీమ్స్ తో వర్క్ చేయడం?
    ఒక ఫ్రెష్ మ్యూజిక్ చేయాలని అనుకున్నాం. భీమ్స్ గారికి కూడా చాలా ఫ్రెష్ ప్రాజెక్టు అయింది. ఇది నేను చేసిన మ్యూజిక్ లాగా లేదని ఆయనే అన్నారు. రుబారు పాట ఐతే రెహమాన్ గారి పాటలు నేను పాడినట్టుగా ఉందని అందరూ అనుకుంటున్నారని చెప్పారు (నవ్వుతూ)
  • కన్నే పెట్టరో సాంగ్ ఆలోచన ఎవరిదీ?
    హరి క్యారెక్టర్ ఒక మూమెంట్లో ఎంజాయ్ చేసే మూడ్లో ఉంటాడు. ఆ సీక్వెన్స్ చెబుతున్నపుడు సుప్రియ గారు ఫస్ట్ టైం ఎప్పుడు డ్యాన్స్ చేశావ్ అన్నారు. వైజాగ్ లో చిన్నప్పుడు కన్నె పెట్టారో, చీజ్ బడిహె పాటలు కి డాన్స్ చేసానని చెప్పాను. అయితే ఇవే పాటలు పెడదామని చెప్పారు. హిందీలో చీజ్ బడి హే, తెలుగులో కన్నెపెట్టరో సాంగ్ పెట్టారు. అవి మంచి ప్లేస్ మెంట్స్ లో వస్తాయి. పోలాకి విజయ్ గారు చాలా స్వీట్ కొరియోగ్రాఫర్. ఆయనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్
  • ప్రొడ్యూసర్ సుప్రియ  గురించి?
    ఈ సినిమాకి కర్త కర్మ క్రియ సుప్రియ గారు. వంద రోజులు షూటింగ్ అంటే 100 పెళ్లిళ్లు చేయడం లాంటిది. ఎన్నో కంప్లయింట్స్, ఈగోలు వుంటాయి. వీటన్నిటిని ఎంతో ఓపికతో తల్లిదండ్రులు భరిస్తారు. ప్రొడ్యూసర్ కూడా అంతే. సుప్రియ గారు ట్రూలీ జమ్ ప్రొడ్యూసర్.
  • ఈ సినిమాలో మహేష్ బాబు  డైలాగ్ పెట్టడానికి కారణం?
    -రైటింగ్ ప్రాసెస్ లో చాలా ఫ్లోలో వచ్చింది. ఆ సిచువేషన్ కి యాప్ట్ గా ఉంటుంది.

Adivi Sesh,
Dacoit movie,
Adivi Sesh interview,
Dacoit action thriller,
Adivi Sesh latest,
Dacoit chit chat,
Action thriller movies,'
mrunaltakur ,

  • అనురాగ్ కశ్యప్  గురించి?
    నాగచైతన్య శోభిత గారి పెళ్లి వేడుకకి ఆయన హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలో ఆయనకి కథ చెప్పాలని వెళ్లాం. అయితే అప్పటికే ఈ సినిమా గురించి సుప్రియ గారు తనతో చెప్పారని ఆయన అనడం మా అందరికీ సర్ప్రైజ్ గా అనిపించింది. కథ వింటారా అంటే వెంటనే వింటా అన్నారు. అక్కడే ఒక టెంట్ లో కూర్చుని కథ చెప్పాము. ఆయన చాలా హానెస్ట్ పర్సన్.
  • ఈ సినిమా స్టెంట్స్ చేస్తున్నప్పుడు మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏమిటి?
    చేజింగ్లు, స్టంట్స్ చేయడం ఎప్పుడూ టఫ్ ఉంటుంది. మోకాలి గాయం కూడా అయింది. దాని కారణంగా రెండు మూడు నెలలు సినిమా డిలే అయింది. ఆ ఎఫెక్ట్ గూడచారి 2 పై కూడా పడింది. ఒక 6 నెలలు యాక్షన్ చేయొద్దని డాక్టర్లు సూచించారు. ఈ సినిమాలో ఫైట్స్ తక్కువ స్టంట్స్ ఎక్కువ. పెద్ద పెద్ద మౌంటైన్స్ మీద చేశాం. 45 డిగ్రీల వేడిలో క్లైమాక్స్ చేశాం.
  • మేజర్ తర్వాత బాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చాయా?
    -4 వార్ సినిమాలు అలాగే 2 బయోపిక్ ఆఫర్స్ వచ్చాయి. మేజర్ సందీప్ పేరెంట్స్ కి నా ప్యాషన్ ప్రాజెక్టు అని మేజర్ సినిమా చేశాను. ఇప్పుడు మళ్లీ నేను వార్ సినిమాలు చేస్తే ఎథికల్ గా కరెక్ట్ కాదు. బిగ్ బ్యానర్స్ నుంచి బయోపిక్ ఆఫర్స్ వచ్చాయి. కాకపోతే నాకు కథలు నచ్చలేదు.
  • మృణాల్ ఠాకూర్ గురించి?
    తను అద్భుతమైన నటి. తను సీన్ లో ఉన్న ఎమోషన్ ని బయట కూడా ఫీల్ అవుతుంది. తనతో ఒక సీన్ చేసిన తర్వాత పర్ఫామెన్స్ చూసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. మనం కూడా గేమ్ రైజ్ చేయాలని ఒక కాంపిటీషన్ స్పిరిట్ తో చేశాను.

  • మీకు ఎలాంటి స్టోరిస్ ఇష్టం?
    -నాకు బ్రోకెన్ లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం. అందుకే దేవదాస్ సినిమాని మనం ఎన్ని సార్లు అయినా చూస్తాం. నేను రాసిన ప్రతి సినిమాలో నా లైఫ్ లో జరిగింది ఎంతో కొంత ఉంటుంది. నాకు ఫస్ట్ బ్రేకప్ అయినప్పుడు ఏం అర్థం కాలేదు. అప్పుడు 19 ఏళ్ళు. దాన్నుంచి బయటపడడానికి దాదాపు పదేళ్లు పట్టింది. ఆ బ్రేకప్ జరిగినప్పుడు అర్థం కాని ఒక రెండేళ్లు ఉంది. ఆ ఎమోషన్ ని హరి క్యారెక్టర్ ద్వారా ఛానల్ చేయడానికి ట్రై చేశాను.
  • డైరెక్టర్ శానిల్ గురించి
    మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు అన్నదమ్ములలాగే ఉంటాం. సినిమా విషయంలో మాత్రం రాజీపడం.
  • మీరు కెరీబికి బిగినింగ్ నుంచి ఇప్పటివరకు ఒకేలా కనిపిస్తున్నారు.. ఆ సీక్రెట్ ఏంటి?
    నేను స్మ్కోక్, డ్రింక్ చేయను. అలాగే నాన్ వెజ్ కూడా తినను. యుఎస్ లో పెరగడం వల్ల మసాలాలు కారం కూడా ఎక్కువగా తినలేను
  • జి 2 అప్డేట్?
    జి2 ఈ ఏడాది చివర్లో వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు