Mukul Chaudhary Leads Lucknow to Victory Over Kolkata:ఐపీఎల్ (IPL) లో ముకుల్ చౌదరి (mukul choudary) సిక్సర్లతో ఆటను మెరిపించాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ ను అవలీలగా గెలిపించాడు. కోల్ కత్తా తో జరిగిన హోరాహోరీ పోరులో లక్నో (loknow) బ్యాట్స్ మెన్ ముకుల్ చోదరీ ఏడు సిక్స్ లతో బౌలర్ల దుమ్ము దులిపాడు.
ముప్ఫై పరుగులు ఉన్న దగ్గరి నుంచి ముకుల్ తన బ్యాటింగ్ తో కోల్ కత్తా బౌలర్లకు చెమటలు పట్టించాడు. 182 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లక్నో వరుసగా వికెట్లు కోల్పోయింది. లక్నో ఓడిపోతుంది అనుకుంటున్నా సమయంలో బ్యాటింగ్ కు దిగిన ముకుల్ చౌదరి చెప్పి మరీ సిక్స్ లు కొట్టాడు. పనిలో పనిగా యాభై పరుగులు చేసి హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయాన్ని కోల్ కత్తా (kolkattha)ఊహించుకోలేకపోయింది. చివరి ఓవర్లో రెండు డాట్ బాల్స్ వేసినా ఆ తరువాత ఒక్క సిక్స్ తో మ్యాచ్ డ్రా అయింది.
చివరి ఆల్ కు ఒకే ఒక పరుగు అవసరం ఉండగా ఆ ఒక్క పరుగును కూడా చేసేశారు. దీంతో కోల్ కత్తా నైట్ రైడర్స్ పై లక్నో టీమ్ విజయం సాధించింది. చివరి ఓవర్ ముగిసే వరకు లక్నో టీమ్ ఓనర్ స్టేడియంలో నిలబడి దేవుణ్ణి మొక్కుతూనే ఉన్నాడు. చివరి ఓవర్లో రెండు డాట్ బాల్స్ వేయడంతో మ్యాచ్ చేజారిపోతుందని అందరూ భావించారు.
కానీ ముకుల్ చేసిన బ్యాటింగ్ తో లక్నో యాజమాన్యం ముఖంలో చిరునవ్వు వెలిగింది. నిర్ణిత 20 ఓవర్లలో కోల్ కత్తా 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన లక్నో నిర్ణిత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి విజయ తీరాన్ని చేసింది.


