bollywood great singer asha bhosle nomore :
* ముంబయి ఆసుపత్రిలో కన్నుమూత
* తెలుగు పాటలకు ఆశా స్వరం
దశాబ్దాలుగా తన గళంతో బాలీవుడ్ ను ఏలిన దిగ్గజ గాయని ఆశా భోస్లే (92) స్వరం మూగబోయింది. గుండె , శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో ఆమె శనివారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఇదే ఆసుపత్రిలో ఆమె తుది శ్వాస విడిచినట్టు ఆశాభోస్లే కుమారుడు ఆనంద్ భోస్లే ఆదివారం ప్రకటించారు.

గత కొన్ని నెలలుగా ఆమె ఆరోగ్యం బాగాలేదని, పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకువచ్చామని ఆయన తెలిపారు. చికిత్సకు శరీరం సహకరించలేడని, ఆమె తుదిశ్వాస విడిచారని ఆయన ధ్రువీకరించారు. సోమవారం ఆశా భోస్లే అంత్యక్రియలు జరుగుతాయని పేర్కొన్నారు.
భారతీయ సినిమా రంగంలో అత్యంత విజయవంతమైన, ప్రజాదరణ పొందిన గాయని ఆశా భోస్లే. అత్యధిక పాటలు పాడిన గాయనీమణుల్లో ఆమెకు ఆమె సాటి అని చెప్పడం అతిశయోక్తి కాదు. 1933లో సంగీత నేపథ్యం ఉన్న మంగేష్కర్ కుటుంబంలో జన్మించిన ఆశా, 9 సంవత్సరాల వయస్సులోనే వృత్తిపరంగా గాయనిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆమె 1943లో తన మొదటి సినిమా పాటను రికార్డ్ చేశారు. 50వ దశకం నాటికి బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆ తర్వాతి మూడు దశాబ్దాల పాటు, ఆమె చాలా మంది సంగీత దర్శకులకు అత్యంత ఇష్టమైన గాయనీమణులలో ఒకరిగా నిలిచారు.

మొదట్లో ఆమె కేవలం క్యాబరే నంబర్లు లేదా నేటి కాలంలో ఐటమ్ సాంగ్స్ అని పిలవబడే నృత్యాలు పాడటానికే పరిమితమైనప్పటికీ, ఆశా తన పరిధిని విస్తరించుకుని, ‘ఉమ్రావ్ జాన్’లో గజల్స్‌ను కూడా అద్భుతంగా ఆలపించారు. ఆమె ఏడుసార్లు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నేపథ్య గాయని అవార్డును అందుకున్నారు. ‘ఉమ్రావ్ జాన్’లోని ‘దిల్ చీజ్ క్యా హై’, ‘ఇజాజత్’లోని ‘మేరా కుచ్ సామాన్’ పాటలకు రెండుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. 1933 సెప్టెంబరు 8న ఆశా భోస్లే మహారాష్ట్రకు చెందిన సాంగ్లి లోని గోర్ అనే చిన్న కుగ్రామంలో ఒక సంగీత కుటుంబంలో జన్మించింది.
జన్మించారు. 1943లో ప్రారంభమైన ఆమె పాటల ప్రస్థానం సుమారు అరవయ్యేళ్ళ పాటు అప్రతిహతంగా సాగింది. ఈ కాలంలో ఆమె వెయ్యికి పైగా హిందీ సినిమాల్లో పాటలు పాడింది. మరో గాయని లతా మంగేష్కర్ కు ఆమె సోదరి. సినిమా సంగీతం, పాప్ సంగీతం, గజల్స్, భజన పాటలతోపాటు భారత సాంప్రదాయ సంగీతం, జానపదాలు, ఖవ్వాలీ పాటలను పాడటంలో ఆశ సిద్ధహస్తురాలు.
గణపత్రావ్ భోస్లేతో ఆశా వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం. గాయనిగా అనేక ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆశా భోస్లే

ఉత్తమ నేపధ్య గాయని గా 18 సార్లు ఫిలిం ఫెర్ అవార్డు గెలుచుకున్నారు. గరీబో కి సునో (దాస్ లాఖ్ ),పర్దే మే రెహ్నే దో” (షికార్), పియా తూ అబ్ తో ఆజా ” (కారవాన్), దం మారో దం” (హరేరామా హరేకృష్ణ), హోనే లగీ హై రాత్ ” (నైనా), చైన్ సే హం కో కభీ ” (ప్రాన్ జాయే పర్ వచన్ న జాయే), యే మేరా దిల్ ” (డాన్) సినిమాల్లో పాడిన పాటలకు ఆమెకు అవార్డులు తెచ్చిపెట్టాయి.
రెండు సార్లు జాతీయ ఉత్తమ నేపధ్య గాయని అవార్డులు గెలుచుకుంది. 1981లో దిల్ చీజ్ క్యా హై (ఉమ్రావ్ జాన్), 1986 మెరా కుచ్ సామాన్ (ఇజాజత్) పాటలకు జాతీయ అవార్డు దక్కించుకున్నారు. భారతీయ సినిమాకు ఆమె చేసిన కృషికి గాను 2000లో ఆమె దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నది. హిందీ తో తెలుగు, తమిళ, బెంగాలీ, కన్నడ భాషల్లో పాటలు పాడిన ఆశా భోస్లేను భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ తో సత్కరించింది.
ఆశా భోంస్లే పాడిన తెలుగు పాటలు:
నాలో ఊహలకు (ఆకలి రాజ్యం – 1981) తెలుగులో ఆమె పాడిన అత్యంత ప్రజాదరణ పొందిన పాటలలో ఒకటి.సీతాకాలం సినిమాలో
మాటే మంత్రము అనే పాటను పాడారు. సిరిమల్లె నీవే అనే పాటను పంజరంలో పసిపాప సినిమా కోసం పాడారు. పాలు నీళ్ళు (1968) సినిమాలోని ఇది మౌనగీతం, పంజరంలో పసిపాప లోని నీలి నీలి కళ్ళలో, చట్టానికి కళ్ళు లేవు లో ఆకాశం పందిరి వంటి పాటలను పాడి సంగీత శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నారు. శారీరకంగా ఆశా మన మధ్య లేకపోవచ్చు కానీ ఆమెపాడిన పాటలు శాశ్వతంగా వినిపిస్తూనే ఉంటాయని బాలీవుడ్ పరిశ్రమ ఆమె సేవలను కొనియాడింది.


