Sunday, April 19, 2026
Ad Banner

chinthamani :”చింతామణి సొంతకథ” షూటింగ్ షురూ

chinthamani wone story shooting : శ్రీరామ్, మహిమా గుప్త హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “చింతామణి సొంతకథ”. ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రేమ్ రాజ్ రూపొందిస్తున్నారు. మిత్రా మూవీ మేకర్స్ బి.రాజీవ్ కుమార్, రాకేష్ కర్రె, డా. ఎన్ వీ రావు, శ్రీనివాస్ పసుపులేటి నిర్మిస్తున్నారు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఆదివారం ఈ సినిమా ప్రారంభోత్సవం పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. ఎమ్మెల్సీ, ప్రభుత్వ చీఫ్ విప్ డా. అద్దంకి దయాకర్, తెలంగాణ కౌన్సిల్ ఫర్ […]

chinthamani wone story shooting : శ్రీరామ్, మహిమా గుప్త హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “చింతామణి సొంతకథ”. ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రేమ్ రాజ్ రూపొందిస్తున్నారు. మిత్రా మూవీ మేకర్స్ బి.రాజీవ్ కుమార్, రాకేష్ కర్రె, డా. ఎన్ వీ రావు, శ్రీనివాస్ పసుపులేటి నిర్మిస్తున్నారు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఆదివారం ఈ సినిమా ప్రారంభోత్సవం పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. ఎమ్మెల్సీ, ప్రభుత్వ చీఫ్ విప్ డా. అద్దంకి దయాకర్, తెలంగాణ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

డా. అద్దంకి దయాకర్ క్లాప్ ఇవ్వగా,జీహెచ్ఎంసీ రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ వందనకుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సోషల్ యాక్టివిస్ట్ డా. శ్రీనివాస్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. నటుడు కాశీ విశ్వనాథ్, రచయిత నివాస్ కలిసి దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు.

ఈ సందర్భంగా నిర్మాత బి.రాజీవ్ కుమార్ మాట్లాడుతూ మా మిత్రా మూవీ మేకర్స్ బ్యానర్ పై రెండవ సినిమా గా “చింతామణి సొంతకథ” చిత్రాన్ని నిర్మిస్తున్నాం. దర్శకుడు ప్రేమ్ రాజ్ ఒక మంచి కథను మాకు చెప్పారు. కథలోని స్ట్రాంగ్ కంటెంట్ ను నమ్మి మేము సినిమా చేసేందుకు ముందుకొచ్చాం. మా సినిమాకు హీరో హీరోయిన్స్ శ్రీరామ్, మహిమా గుప్త పర్పెక్ట్ గా సరిపోయారు. మేము మా బ్యానర్ లో ఏడాదికో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం.అన్నారు.

డైరెక్టర్ ప్రేమ్ రాజ్ మాట్లాడుతూ- దర్శకుడిగా నాకు నాలుగో చిత్రమిది. గతంలో నేను చేసిన మూడు చిత్రాలు మెసేజ్ ఓరియెంటెడ్ గా ఉంటాయి.ఇప్పుడు నాలుగో చిత్రంగా కమర్షియల్ పంథాలో క్రైమ్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా చేస్తున్నాను.క్రైమ్ థ్రిల్లర్ కథైనా ఇందులో భార్య భర్తల మధ్య మంచి డ్రామా ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. యూత్ ను టార్గెట్ చేస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. ఇప్పుటి ట్రెండ్ కు అనుగుణంగా రూపొందిస్తున్నాం. ప్రేక్షకులు సినిమాను కొత్తగా ఫీలవుతారు. తెలుగు, హిందీ భాషల్లో స్ట్రైట్ మూవీ ఇది. తమిళ, మలయాళ, కన్నడలో డబ్ చేస్తాం. మా ప్రొడ్యూసర్స్ నలుగురు నాలుగు పిల్లర్స్ లా నిలబడి ఈ మూవీ నిర్మిస్తున్నారు. హీరోయిన్ మహిమా గుప్తకు ఈసినిమాతో మంచి పేరొస్తుంది. హీరో శ్రీరామ్ మా మూవీకి ముఖచిత్రం లాంటివారు. కథ విన్న వెంటనే ఈ సినిమా చేస్తానంటూ ముందుకొచ్చారు. మీ అందరి సహకారం మాకు ఉంటుందని ఆశిస్తున్నాం.అన్నారు.

హీరోయిన్ మహిమా గుప్త మాట్లాడుతూ – తెలుగులో నాకు తొలి చిత్రమిది. ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. శ్రీరామ్ సరసన నటించే అవకాశం దక్కడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నా.అన్నారు.నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ- ప్రేమ్ రాజ్ నాకు మిత్రుడు.ఈ కథ నాకు తెలుసు. చాలా మంచి స్టోరీ.ఈ చిత్రంలో నేను ఒక క్యారెక్టర్ లో నటిస్తున్నాను. క్రైమ్ థ్రిల్లర్ తో పాటు సస్పెన్స్, ఫ్యామిలీ డ్రామా అంశాలు ఆకట్టుకుంటాయి.అన్నారు.

chinthamanisonthakatha,sriramtamilactor,mahilaactress,premraj director
chinthamanisonthakatha,sriramtamilactor,mahilaactress,premraj director

హీరో శ్రీరామ్ మాట్లాడుతూ – మా డైరెక్టర్ ప్రేమ్ రాజ్ లాగే నేను కూడా ప్రతి సినిమా మొదటి సినిమాగానే భావించి నటిస్తాను. “చింతామణి సొంత కథ” సినిమా మిత్రా మూవీ మేకర్స్ కు హిట్ మూవీ అవుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగబాల సురేష్ కుమార్, తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ అధ్యక్షులు నాని, తదితరులు పాల్గొన్నారు
శ్రీరామ్, మహిమా గుప్త,నాజర్, కాశీ విశ్వనాథ్, వడ్లమాని శ్రీనివాస్, మురళీధర్ గౌడ్, రవికాలే, శ్రీలక్ష్మి , నర్రా శ్రీనివాస్, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీ : ప్రతాప్ ,ఫైట్స్ : సుబ్బు,లిరిక్స్ – సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, మెట్టపల్లి సురేందర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు