Sunday, April 19, 2026
Ad Banner

Supriya: మంచి సినిమా తీశామనే సంతృప్తి ఉంది: నిర్మాత సుప్రియ యార్లగడ్డ

We Feel Proud to Have Made a Good Film: Producer Supriya Yarlagadda”:    అడివి శేష్ లేటెస్ట్ ఆడియన్స్ బ్లాక్ బస్టర్ ‘డెకాయిట్‌. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. షానియల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన […]

We Feel Proud to Have Made a Good Film: Producer Supriya Yarlagadda”:    అడివి శేష్ లేటెస్ట్ ఆడియన్స్ బ్లాక్ బస్టర్ ‘డెకాయిట్‌. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. షానియల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత సుప్రియ యార్లగడ్డ విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

డెకాయిట్‌ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఎలా అనిపిస్తోంది ?
-చాలా హ్యాపీ. ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ మనసుకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.

డెకాయిట్‌ ని రెండు భాషల్లో తీశారు కదా.. ఒక భాషలో తీసి డబ్ చేసి వుంటే బడ్జెట్ తగ్గేది కదా?
-అన్నీ బడ్జెట్ పరంగా అలోచేస్తే సినిమాకి, కథకి న్యాయం చేయలేం. సినిమా అంటే ఒక మ్యాజిక్ వుండాలి. అలాంటి మ్యాజిక్ ఈ కథకు అవసరం అనిపించింది. అయితే అన్నీ జాగ్రతలు తీసుకునే చేశాం.

-హిందీలో రెస్పాన్స్ చాలా బావుంది. తెలుగులో తీసిన సినిమా అక్కడికి చేరడం చాలా ఆనందంగా వుంది. హిందీలో లాంగ్ రన్ వుంటుంది.

-డెకాయిట్‌ ని తమిళ్ మలయాళం కన్నడలో కూడా డబ్ చేశాం. కాకపోతే ఆ డబ్ ఓటీటీకి పరిమితంగా వుంటుంది. సినిమా కేరళలో దుల్కర్ గారి బ్యానర్ ద్వారా రిలీజ్ అయ్యింది.

పవన్ సింగ్ క్యామియో గురించి?
-పవన్ సింగ్, జోనితా లాంటి స్టార్స్ వుండటం వలన నార్త్ లో చాలా హెల్ప్ అయ్యింది. పవన్ సింగ్ గారిని ఒక పాట పాడమని సంప్రదించారు. అయితే ఆయనే కనిపిస్తాని అన్నారు.

-భోజ్ పురి వారికి తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం. మాస్ సినిమా అక్కడ చాలా పాపులర్. అంత పాపులర్ వుటుందని నేనూ ఊహించలేదు. పవన్ సింగ్ గారు నాగ్ సర్ ని కలవాలని అడిగారు. మన సినిమా వాళ్ళు అంత ప్రేమిస్తారు. డెకాయిట్‌ కోసం చాలా మంది చాలా ప్రేమని చూపించారు. జోనితా పాట పాడటంతో పాటు తెరపై కనిపించింది.

SupriyaYarlagadda,TeluguCinema,
FilmProducer,
MovieSuccess,
CinemaPride,
IndianFilms,
Tollywood,
FilmMaking,
ProducerTalk,
MoviePromotion,
SupriyaYarlagadda,
TeluguCinema,
FilmProducer,
MovieSuccess,
CinemaPride,
IndianFilms,
Tollywood,
FilmMaking,
ProducerTalk,
MoviePromotion,

డెకాయిట్‌ లో మీరు ఎదురుకున్న ఛాలెంజ్?
-దాదాపు అందరూ కొత్తవాళ్ళతో చేశాం. అందరూ యంగ్ టీం. అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున గారు చాలా మంది కొత్తవాళ్ళని పరిచయం చేశారు. అయితే ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కెమరామ్యాన్ అయినా అనుభవం కలిగిన వారు వుంటారు. ఆయన అనుభవం సినిమాకి చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే ఇందులో డీవోపీ కూడా కొత్తే.

-సినిమాని డిఫరెంట్ లోకేషన్స్ లో షూట్ చేశాం. డ్యాం దగ్గర షూట్ చేసినప్పుడు పర్మిషన్ తీసుకోవడం అంత ఈజీ కాదు. దాదాపు రెండువందల మందిని ఒక్క చోటికి చేర్చి షూట్ చేయాల్సి వచ్చేది. ఇలా షూటింగ్ లో చాలా ఛాలెంజెస్ వున్నాయి.

డెకాయిట్‌ క్లైమాక్స్ రిస్క్ అనిపించలేదా?
-మంచి సినిమాకి ఎప్పుడూ రిస్క్ వుంటుంది. ఈ సినిమాలో క్లైమాక్స్ నే అందం. నాకు డ్రామా, ప్రేమకథలు ఇష్టం, కాకపోతే ఇప్పుడు తెలుగు అవి మిస్ అవుతున్నాయి. డెకాయిట్‌ కథని నిజాయితీగా చెప్పాలనుకున్నాం. చాలా మంది క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.

-హరి క్యారెక్టర్ లో శేష్ గారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. శేష్, మృణాల్ క్యారెక్టర్ ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాయి.

యూఎస్ రెస్పాన్స్ ఎలా వుంది?
-అద్భుతంగా వుంది. వీకెండ్ కి వన్ మిలియన్ దాటేస్తుంది. మహిళలకు, యువతకు సినిమా చాలా కనెక్ట్ అవుతుంది.

ఓటీటీకి ఎనిమిది వారాల గడువు ఉండాలనే నిబంధన తీసుకురావాలనే అభిప్రాయం వ్యక్తమౌతోంది?
-అది అందరూ కలిసి చేయాలి. సినిమాలు తీసే నిర్మాతలు అందరూ కలసి నిర్ణయం తీసుకోవాలి. సినిమా ఆడాలంటే థియేటర్ బావుండాలి.

యస్ యస్ క్రియేషన్స్ లో సినిమాలు కొనసాగిస్తారా?
-నాకైతే చేయాలనే వుంది. సినిమా అంటే నాకు ప్రేమ. సినిమాతో ఆడియన్స్ సర్ప్రైజ్ లు ఇస్తే ఇష్టం. డెకాయిట్ లాంటి సినిమా తీయడం నాకు చాలా తృప్తి ఇచ్చింది. ప్రేమ త్యాగం, ద్రోహం, మోసం లాంటి  ఎమోషన్స్ మన క్లాసిక్ లవ్ స్టొరీస్ లో వుంటాయి. ఇలాంటి కథలు తీయడానికి నేను బలం అవుతాను.

మీకు ఇష్టమైన ప్రేమకథలు?
-నేను తీసిన మన్మధుడు నా ఫేవరేట్. అలాగే జానకి రాముడు నాకు చాలా ఇష్టం. మజ్ను కూడా నా ఫేవరట్.అలాగే సత్యం సినిమా ఇష్టం. గీతాంజలి అయితే మా ఫ్రెండ్స్ అందరి ఫేవరేట్. ఆ సినిమా వేవ్ బిగినింగ్ లో ఎవరికీ అర్ధం కాలేదు.

ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్ గురించి?
-ఇప్పటి హీరోయిన్స్ కి కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. అలాగే మల్టీ ప్రాజెక్ట్స్ లో వారి ఫోకస్ వుంటుంది. ఇలాంటి పరిస్థితులులో కూడా మృణాల్ ఈ సినిమా కోసం తన ప్రాణం పెట్టి పని చేశారు.

-బలమైన ఫీమేల్ ఫార్వార్డ్ క్యారెక్టర్ తో సినిమాలు చేయాలనేది నా కోరిక. డెకాయిట్‌ ఈ విషయంలో చాలా తృప్తిని ఇచ్చింది.

-అనురాగ్ కశ్యప్  ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పగానే చేస్తా అన్నారు. తర్వాత  కథ విని చాలా ఇంప్రెస్ అయ్యారు. అలాగే ప్రకాష్ రాజ్ గారు చాలా బిజీ షెడ్యుల్ లో కూడా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా టైం తీసుకోని చేశారు.

డెకాయిట్‌ డాల్బీ వెర్షన్ లో చూస్తుంటే సౌండ్ చాలా కొత్తగా అనిపించింది? ఆ ఎక్స్ పీరియన్స్ గురించి?
-జ్ఞాని అద్భుతమైన వర్క్ ఇచ్చాడు. అలాగే అనంత్ కూడా చాలా చక్కగా చేశాడు. డెకాయిట్‌ టెక్నికల్ గా బ్రిలియంట్ గా వుందనే రెస్పాన్స్ అన్ని చోట్లనుంచి వచ్చింది.

నాగార్జున గారి సినిమా అప్డేట్ గురించి?
-నాగార్జున గారు చెబినేతే బావుంటుంది. నేను చెప్పకూడదు(నవ్వుతూ)

మీ బ్యానర్ లో నెక్స్ట్ సినిమా ఎప్పుడు?
-కథలు వినడం మొదలుపెడతాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు