friend and lover each side : ఫ్యాషన్ హంట్ సమర్పణలో ప్రిన్స్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నజీం ఎస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’. ఈ సినిమాతో ప్రిన్స్, సాంచి కశ్యప జంటగా తెరకు పరిచయం కాబోతోన్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో ప్రిన్స్ మాట్లాడుతూ ‘మేం అంతా ఎంతో కష్టపడి‘అటు ఫ్రెండ్ ఇటు లవర్ సినిమాని తీశాం. అందరి సహకారంతోనే చిత్రాన్ని పూర్తి చేయగలిగాం. దర్శకుడు ఈ మూవీని ఎంతో గొప్పగా చిత్రీకరించారు. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది.
ఈ క్రమంలో మాకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. తెలుగు ఆడియెన్స్ మంచి చిత్రాల్ని ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. సాంచీతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. మా సినిమాని ఇలానే అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.హీరోయిన్ సాంచి కశ్యప మాట్లాడుతూ ‘‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’ చిత్రంలో అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది.

Atu Friend Itu Lover,
Atu Friend Itu Lover trailer,
Atu Friend Itu Lover movie,
Atu Friend Itu Lover Telugu movie,
Atu Friend Itu Lover trailer launch,
ఈ మూవీ కోసం మేం ఎంతో కష్టపడ్డాం. మా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ అని అన్నారు.డైరెక్టర్ నజీం ఎస్ మాట్లాడుతూ ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’ సినిమాని మేమంతా కలిసి గొప్పగా తెరకెక్కించాం. ప్రిన్స్, సాంచి మాకు ఎంతో సపోర్ట్ చేశారు. కొత్త దర్శకుడ్ని కదా? అని కాకుండా ప్రతీ విషయంలో నాకు బ్యాక్ బోన్‌లా నిలిచారు. ఈ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఇంకా చాలా విషయాల్ని సక్సెస్ మీట్‌లో మాట్లాడతాను అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ప్రణీత్ మాట్లాడుతూ ..‘‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’ మ్యూజిక్ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఇదొక డిఫరెంట్ స్టోరీ. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.కెమెరామెన్ రాము రాయల్ మాట్లాడుతూ ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’లో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. అని అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ : లోకేష్ కుమార్ కడలి, డీఓపీ : రాము రాయల్.


