“It’s Been a Long Time Since I’ve Seen Success – Hero Rajasekhar: హీరో రాజశేఖర్ మాట్లాడుతూ ఏప్రిల్ 3 బైకర్ సినిమా రిలీజయింది. అప్పటి నుంచి నా పాత్రకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎంతో మంది ఫోన్లు చేసి మెచ్చుకున్నారు. కానీ నా మనసులో ఇక్కడికి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. క్రిటిక్స్ అసోసియేషన్ అంటే నాకు ప్రత్యేక గౌనవం ఉంది.
వేరే అవార్డులతో పోల్చితే ఇదే నాకు చాలా పెద్ద అవార్డు. అంకుశం ముందు నాకు యాక్సిడెంట్ అయింది. అంకుశం పెద్ద హిట్ అయింది. ఆ తరువాత వచ్చిన మగాడు సినిమా కూడా పెద్ద హిట్ అయింది. అదే విధంగా ఇటీవలె మళ్లీ నాకు యాక్సిడెంట్ అయింది. బైకర్ మంచి హిట్ అయింది.

ఆ తరువాత వస్తున్న సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. ఇప్పుడిప్పుడే కాస్త బెటర్‌గా ఫీలవుతున్నాను. బైకర్ హిట్ మాత్రం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఎందుకంటే సక్సెస్ చూసి చాలా రోజులు అవడంతో నాకు అలా అనిపిస్తుందేమో నాకు తెలియదు.
ఏది ఏమైనప్పటపికీ నేను థియేటర్ నుంచి బయటకు రాగానే మీరు ఇంకా సినిమాలు చేయాలి అంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఇంకా కంటిన్యూస్‌గా రావాలి. మంచి సినిమాలు చేస్తుండాలి అని ప్రేక్షకులు అంటుంటే చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజశేఖర్ తో మీట్ ది ప్రెస్ రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు.

జీవితరాజశేఖర్ మాట్లాడుతూ మనమందరం ఒక ఫ్యామిలీలాంటి వాళ్ళం. మీడియాతో మాకు ఎప్పుడూ బావుంటది. మమ్మల్ని మీరు ఎప్పుడూ కించపరచలేదు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఎక్కువయిపోయి వాటిల్లో వచ్చే కొన్ని వార్తల వల్ల అసలు మీడియా ఏంటి జర్నలిజం ఏంటి అని కొంత కన్‌ఫ్యూజన్‌కి గురయ్యాను.

రాజశేఖర్ కి ఎన్నో అవకాశాలు వచ్చినా తను ఇన్‌స్పైర్ అయ్యే పాత్రలు రాక చేయడం లేదు. అదే విషయాన్ని ఆయన “బైకర్” ప్రమోషన్స్ సమయంలో చెబితే. దానికి… “రాజశేఖర్ క్యారెక్టర్స్ అడుగుతున్నారు” అన్నారు. ఆఫర్స్ అనేకం వస్తున్నాయి. నచ్చిన పాత్రలు రావడంలేదు అన్నారు. ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మొత్తం ఫ్యామిలీని కలిసినట్లు అనిపించింది” అని అన్నారు.


