“Mr. X – A Spy Action Thriller starring Arya” :ఆర్య, గౌతమ్ కార్తీక్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మిస్టర్ ఎక్స్’. ఎఫ్ఐఆర్ సినిమాతో ఆకట్టుకున్న మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. మంజు వారియర్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రంలో అతుల్య రవి, రైజా విల్సన్, అనఘ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్రం ఏప్రిల్ 17న తెలుగు, తమిళ్ లో వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ సందర్బంగా హీరో ఆర్య మాట్లాడుతూ దాదాపు మూడేళ్ల తర్వాత నా సినిమా తెలుగులో రిలీజ్ అవుతోంది. సైంధవ్‌లో ఒక గెస్ట్ రోల్ చేశాను. పూర్తిస్థాయిలో ‘మిస్టర్ ఎక్స్ తో రావడం చాలా ఆనందంగా ఉంది. మిస్టర్ ఎక్స్ ఒక థియేటర్ ఎక్స్‌పీరియన్స్ సినిమా. డైరెక్టర్ మను ఆనంద్ ఎఫ్ఐఆర్ సినిమా నాకు చాలా ఇష్టం. ఆయన మిస్టర్ ఎక్స్ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. ఇందులో యాక్షన్, ఎమోషన్స్, క్యారెక్టర్స్ అన్నీ కలిసి గొప్ప అనుభూతి కలిగించేలా తీర్చిదిద్దారు.
గౌతమ్ చాలా కొత్త క్యారెక్టర్ చేశాడు అని అన్నారు. మంజు వారియర్ మాట్లాడుతూ డైరెక్టర్ మను ఈ సినిమాలో నాకు చాలా బలమైన పాత్ర ఇచ్చారు. నా కెరీర్‌లో ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చేయలేదు. ఆర్య ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అలాగే గౌతమ్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర చేశారు. ఈ సినిమాలో శరత్ కుమార్ తో కలిసి నటించే అవకాశం దొరికింది అని ఆమె చెప్పారు. గౌతమ్ కార్తీక్ ,అతుల్య రవి ,డైరెక్టర్ మను ఆనంద్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.


