salman khan dil raju nayanatara movie shooting starts in mumbai : సల్మాన్ ఖాన్–వంశీ పైడిపల్లి–దిల్ రాజు కాంబినేషన్ లో మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ షూటింగ్ దశలోకి అడుగుపెట్టింది. ముంబైలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవగా, కథానాయికగా నయనతార అధికారికంగా సెట్స్‌లో చేరారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వంశీ పైడిపల్లి ఫస్ట్ కొలాబరేషన్ కావడం విశేషం. ఈ కాంబినేషన్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించగా, షూటింగ్ ప్రారంభంతో ఆ ఆసక్తి మరింత పెరిగింది.
ఈ సినిమా తొలి షెడ్యూల్ శనివారం ముంబై లో సంప్రదాయ ముహూర్తం కార్యక్రమంతో ప్రారంభమై, నెల రోజులపాటు సాగనున్న భారీ షెడ్యూల్ మొదలైంది. ముంబైలో ప్రత్యేకంగా నిర్మించిన హ్యూజ్ సెట్లో హై-ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు, కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు.ఈ కీలక షెడ్యూల్‌లో నయనతార కూడా ప్రధాన తారాగణంలో చేరారు. ప్రతి పాత్రని బలంగా తీర్చిదిద్దే వంశీ పైడిపల్లి, ఈ చిత్రంలో ప్రధాన పాత్రలని అద్భుతంగా రూపొందించారు. సల్మాన్ ఖాన్–నయనతార జోడీ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.దర్శకుడు వంశీ పైడిపల్లి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ “#సల్మాన్ ఖాన్ వంశీ పైడిపల్లి ఫిల్మ్… ఈరోజు మొదలైంది..” అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.బలమైన భావోద్వేగాలతో కూడిన హై ఎనర్జీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం 2027లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


