Sunday, April 19, 2026
Ad Banner

Etv Winలో స్ట్రీమ్ కావడం గర్వంగా ఉంది: యుఫోరియా డైరెక్టర్‌ గుణ శేఖర్

“Proud to Stream on ETV Win: Euphoria Director Gunasekhar”: డైరెక్టర్‌ గుణ శేఖర్ దర్శకత్వంలో భూమిక, సారా అర్జున్ ప్రధాన పాత్రలలో నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ & యుక్త గుణ నిర్మాతలుగా తెరకెక్కించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఏప్రిల్ 2నుంచి ఈటీవి విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీస్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. […]

“Proud to Stream on ETV Win: Euphoria Director Gunasekhar”: డైరెక్టర్‌ గుణ శేఖర్ దర్శకత్వంలో భూమిక, సారా అర్జున్ ప్రధాన పాత్రలలో నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ & యుక్త గుణ నిర్మాతలుగా తెరకెక్కించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఏప్రిల్ 2నుంచి ఈటీవి విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీస్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

ప్రీస్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ లో డైరెక్టర్ గుణశేఖర్ మాట్లాడుతూ అసిస్టెంట్ డైరెక్టర్‌గా నా కెరీర్ రామోజీ రావు ఉషా కిరణ్ మూవీస్ సంస్థలోనే ప్రారంభమైంది. నేను బాగా పని చేస్తున్నానని ఆయన నన్ను ప్రోత్సహించారు. ఉషా కిరణ్ మూవీస్ స్టాండర్డ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. రామోజీ రావు నాకు చాలా ఇన్స్పిరేషన్. కథా చర్చల్లో ఆయన నా అభిప్రాయం కూడా అడిగేవారు. అది నాకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఆ సంస్థ నాకు మంచి పునాది వేసింది. అదే సంస్థ నా “రుద్రమదేవి” సినిమాను తీసుకుంది. ఇప్పుడు “యుఫోరియా” కూడా అదే సంస్థలో వస్తోంది. యుఫోరియా చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం రెండు ప్రతిష్టాత్మక అవార్డులు ఇచ్చింది. ఉత్తమ కథా రచయితగా నన్ను, ఉత్తమ సహాయనటిగా భూమిక ని గౌరవించింది. అంతకంటే పెద్ద గుర్తింపు ఈ రోజు ఈటీవీ విన్ వారు ఇచ్చారు. ఈటీవీ విన్‌లో ఈ సినిమా విడుదల కావడం నాకు చాలా గర్వంగా ఉంది.

నిజానికి ఓటీటీ వాళ్లు కంటెంట్‌ను బోల్డ్‌గా చెప్పడానికి ప్రోత్సహిస్తారు. కానీ అలాంటి సంస్థలే ఈ కథ షాకింగ్‌గా ఉందని వెనకడుగు వేశాయి. నితిన్ గారు చెప్పినట్టు, “బోల్డ్” అంటే విజువల్‌గా కాదు, కంటెంట్ రూపంలో చెప్పేది. ఈటీవీ కథల ద్వారా సమాజానికి అద్దం పట్టే సినిమాలను తీయడంలో ముందుంది. “చిత్రం”, “మయూరి”, “మౌన పోరాటం” లాంటి ఎన్నో అద్భుత కథలను చెప్పారు. సమాజంలో జరిగే సంఘటనలను ప్రజలకు చూపించారు. అదే నాకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే “యుఫోరియా” తీశాను.

“కంటెంట్ ఈజ్ కింగ్” అని ప్రేక్షకులు అంటున్నారు. అలాంటి కంటెంట్‌తో సినిమా తీసినప్పుడు ప్రేక్షకులు కూడా థియేటర్‌కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు అద్భుతమైన రివ్యూలు వచ్చాయి. కానీ చాలా మంది ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందో అడిగారు. ఇది థియేటర్ కోసం తీసిన సినిమా. ప్రేక్షకులు థియేటర్‌లో చూడాల్సిన సినిమా. మంచి కథలను తీసే దర్శకులను ఎంకరేజ్ చేయండి.

#ETVWin #Gunasekhar #Euphoria #TeluguCinema #OTTRelease #StreamingNow #Director #Tollywood #DigitalPremiere
#ETVWin #Gunasekhar #Euphoria #TeluguCinema #OTTRelease #StreamingNow #Director #Tollywood #DigitalPremiere

ఆడియన్స్‌ని కూడా తప్పుపట్టలేం. ఓటీటీ సినిమాలను ప్రభావితం చేసింది. మూడు వారాల్లో సినిమా ఓటీటీలోకి రావడంతో, పెద్ద సినిమాలు థియేటర్‌లో, కంటెంట్ సినిమాలు ఓటీటీలో చూడాలని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. కనీసం మూడు నెలలు సినిమా ఓటీటీలోకి రాకూడదు. అప్పుడే సినిమా బతుకుతుంది. థియేటర్‌లో సినిమా బాగా ఆడాలి అంటే ఈ గ్యాప్ అవసరం. ప్రేక్షకులు, పరిశ్రమ అందరూ కలిసి థియేటర్లను కాపాడాలి.

ఈ సినిమాలో కొత్త నటీనటులందరూ ఎంతో ప్యాషన్‌తో పనిచేశారు. ప్రతి ఒక్కరూ తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. విఘ్నేష్‌కి మంచి పాత్రలు వస్తున్నాయి. సారా దురంధర్ తో యుఫోరియా సృష్టించింది. ఈ సినిమాతో ఇంకా ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. భూమికకి ఈ పాత్ర చెప్పినప్పుడే అవార్డు వస్తుందని అనుకున్నాం.. అలాగే వచ్చింది.

కాలభైరవ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటివరకు మీరు ప్రీవ్యూస్ చూశారు. అసలైన సినిమా ఏప్రిల్ 2 నుంచి ఈటీవీ విన్‌లో చూస్తారు. ఈటీవి విన్ లో యూఫోరియా చేసే సౌండ్ చాలా గట్టిగా వుంటుంది. మా కుటుంబం తరఫున మీ అందరినీ ఈ సినిమా చూడమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.

#ETVWin #Gunasekhar #Euphoria #TeluguCinema #OTTRelease #StreamingNow #Director #Tollywood #DigitalPremiere
#ETVWin #Gunasekhar #Euphoria #TeluguCinema #OTTRelease #StreamingNow #Director #Tollywood #DigitalPremiere

ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడుతూ  ఈ సినిమా రేపటి నుంచి ఓటీటీలో పెద్ద సౌండ్ చేస్తుంది. విజువల్‌గా లేదా వెర్బల్‌గా బోల్డ్ కంటెంట్ మాకు అవసరం లేదు. నిజమైన కంటెంట్ బోల్డ్‌గా ఉంటే మేము ఎప్పుడూ ప్రోత్సహిస్తాం. ఇది మీరు గత ఐదు సంవత్సరాల్లో చూసే బోల్డెస్ట్ సినిమా. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. గుణశేఖర్ చాలా సెన్సిటివ్ డైరెక్టర్. ఈరోజు రాత్రి 12 గంటల నుంచి ఈటీవీ విన్‌లో కేవలం 99 రూపాయల సబ్‌స్క్రిప్షన్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ సినిమా బెస్ట్, షాకింగ్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది.

ఈటీవీ విన్ మార్కెటింగ్ హెడ్ యువకాంత్ మాట్లాడుతూ  ఈవిన్ సమాజానికి సంబంధించిన కథలను ఎప్పుడూ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది. “యుఫోరియా” కూడా అలాంటి సినిమా. మా ప్లాట్‌ఫామ్‌లో రావడం ఆనందంగా ఉంది. తప్పకుండా ఈటీవీ విన్‌లో చూడండి.

రాగిణి గుణ మాట్లాడుతూ  గుణశేఖర్ కి ఈటీవీతో ఉన్న అనుబంధం చాలా కాలంనుంచిది. “యుఫోరియా” థియేటర్లలో మంచి స్పందన పొందింది. ఇప్పుడు ఓటీటీలో వస్తోంది. ఇది నిజాయితీగా తీసిన సినిమా. ప్రతి తల్లిదండ్రులు తప్పకుండా చూడాలి.

ప్రొడ్యూసర్ నీలిమ గుణ మాట్లాడుతూ.. ఈటీవీ విన్ వారికి ధన్యవాదాలు. ఈ సినిమాకు రెండు గద్దర్ అవార్డులు వచ్చాయి. సారా, భూమిక  అందరూ అద్భుతంగా నటించారు. ప్రభుత్వం ఇచ్చిన గౌరవానికి కృతజ్ఞతలు. ఈవిన్ లో ఈ సినిమా అందరూ తప్పకుండా చూడాలి.

విఘ్నేష్ గవిరెడ్డి మాట్లాడుతూ  ఈ సినిమా గురించి అందరూ హార్ట్‌ఫుల్‌గా మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి సినిమాతో పరిచయం కావడం నా అదృష్టం. తప్పకుండా ఈటీవీ విన్‌లో చూడండి. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఇది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు