Monday, April 20, 2026
Ad Banner

Allu arjun RAKA: అల్లు అర్జున్ ‘రాకా’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Allu Arjun ‘Raka’ First Look Poster Released: భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రం ముందు వరుసలో ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ఆసక్తిగా క్రియేట్ చేసిన ఈ భారీ ప్రాజెక్ట్ టైటిల్‌ను, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ‘రాకా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ‘రాకా’ […]

Allu Arjun ‘Raka’ First Look Poster Released: భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రం ముందు వరుసలో ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ఆసక్తిగా క్రియేట్ చేసిన ఈ భారీ ప్రాజెక్ట్ టైటిల్‌ను, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ‘రాకా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
‘రాకా’ టైటిల్‌తో పాటుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఆయన బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఈ అప్డేట్‌లతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ ఇంత వరకు కనిపించని ఓ కొత్త అవతారంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. గుండుతో, వింత శరీరాకృతితో అందరిలోనూ అంచనాల్ని పెంచేశారు. అల్లు అర్జున్ చూపుల్లో వాడివేడి, పోస్టర్‌ను డిజైన్ చేసిన తీరు అందరిలోనూ అంచనాల్ని రెట్టింపు చేసింది.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అభిమానులు ఐకాన్ స్టార్ పుట్టినరోజును ఈ అప్డేట్లతో ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకుంటున్నారు. దాదాపు ఏడాది పాటు అభిమానులను ఎదురుచూసేలా చేసిన తర్వాత అట్లీ, అల్లు అర్జున్ ఈ అప్డేట్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.

‘రాకా’తో సిల్వర్ స్క్రీన్ మీద ఏం క్రియేట్ చేయబోతోన్నారో అనే చర్చను మరోసారి లేవనెత్తారు. ‘పుష్ప: ది రూల్’ ప్రపంచవ్యాప్త విజయం తర్వాత జాతీయ అవార్డు గ్రహీత నటుడు అల్లు అర్జున్ ‘రాకా’తో అందరినీ మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. ‘రాకా’ ఒక భారీ సాంకేతిక చిత్రంగా ఉంటుందని, హాలీవుడ్ దిగ్గజాలకు దీటుగా విజువల్ ఎఫెక్ట్స్, ప్రపంచ నిర్మాణాన్ని సృష్టించాలని అట్లీ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.‘జవాన్’, ‘తేరి’, ‘బిగిల్’, ‘మెర్సల్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్‌లతో సక్సెస్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా అట్లీ నిలిచారు. అలాంటి అట్లీ భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన మీడియా పవర్‌హౌస్‌లలో ఒకటైన సన్ టీవీ నెట్‌వర్క్‌తో కలిసి ‘రాకా’ని రూపొందిస్తున్నారు.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన యాక్షన్, అద్భుతమైన విజువల్స్, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కథనాన్ని మేళవించి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందేలా ‘రాకా’ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు