“Free Movie for Women… A Good Decision: Raghavendra Rao”: మహిళల సమస్యలను ప్రధానంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం “డైమండ్ డెకాయిట్”. ఈ నెల ఏప్రిల్ 10న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు ట్రైలర్‌ను వీక్షించి చిత్ర బృందాన్ని అభినందించారు.

మహిళలకు ఉచితంగా సినిమా చూపించడం మంచి నిర్ణయమని ఈ సందర్బంగా కె రాఘవేంద్ర రావు అన్నారని హీరో నిర్మాత పార్థ గోపాల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల కానున్న థియేటర్లలో 4 షోలు మహిళలకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు.

మహిళలు ఎక్కువ సంఖ్యలో థియేటర్లకు వచ్చి సినిమా ఆస్వాదించాలని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ చిత్రంలో పార్ధా గోపాల్ హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా వ్యవహరించగా, మేఘనా రెడ్డి హీరోయిన్‌గా నటించారు. రచయిత–దర్శకుడు సూర్య జి. యాదవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పూర్తి కుటుంబ వినోదంతో పాటు హృద్యమైన భావోద్వేగాలతో కూడిన ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది.ఈ చిత్రానికి సంగీతం పీ ఆర్, ఎడిటర్ శివ సర్వాణి, సినిమాటోగ్రఫీ శివ అచంట.


