Sunday, April 19, 2026
Ad Banner

Minister vivek : ఎర్లాంగెన్‌లో తెలంగాణ–జర్మనీ సంధానాలపై మంత్రి వివేక్ దిశానిర్దేశం

Telangana minister Gaddam vivek venkatswamy meeting with erlongine team: * నైపుణ్యాలు, ఉపాధి, గ్లోబల్ భాగస్వామ్యాలపై దృష్టి ఎర్లాంగెన్, జర్మనీ, ఏప్రిల్ 11: ఎర్లాంగెన్ నగరంలో జెర్మనీ లో తెలంగానోళ్ళం కమ్యూనిటీ, TIGER e.V. ఎర్లాంగెన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడిన ప్రత్యేక Meet & Greet కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బవేరియా రాష్ట్ర హోం, […]

Telangana minister Gaddam vivek venkatswamy meeting with erlongine team:
* నైపుణ్యాలు, ఉపాధి, గ్లోబల్ భాగస్వామ్యాలపై దృష్టి
ఎర్లాంగెన్, జర్మనీ, ఏప్రిల్ 11:
ఎర్లాంగెన్ నగరంలో జెర్మనీ లో తెలంగానోళ్ళం కమ్యూనిటీ, TIGER e.V. ఎర్లాంగెన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడిన ప్రత్యేక Meet & Greet కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బవేరియా రాష్ట్ర హోం, స్పోర్ట్స్ మరియు ఇంటిగ్రేషన్ శాఖ మంత్రి జోయాకిం హెర్మన్, ఎర్లాంగెన్ మేయర్ జోర్గ్ వోలెత్‌తో పాటు తెలంగాణ ప్రవాసులు, వివిధ రంగాల నిపుణులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తూ దేశ జీడీపీలో సుమారు 8 శాతం వాటా కలిగి ఉందని, జనాభా కేవలం 3 శాతం మాత్రమే ఉన్నప్పటికీ ఈ స్థాయి సాధించడం గర్వకారణమని తెలిపారు.

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని వివరించారు.
నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంటూ, ఇప్పటివరకు 65 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు స్థాపించామని, మరిన్ని 53 సెంటర్లు ప్రారంభ దశలో ఉన్నాయని తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా జర్మనీతో పాటు దేశీయంగా కూడా ఉపాధి అవకాశాలకు తగిన నైపుణ్యంతో యువతను సిద్ధం చేస్తున్నామని చెప్పారు.అంతర్జాతీయ ఉపాధి అవకాశాల కోసం 12 మిలియన్ యూరోల నిధులతో TOMCOM శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు.

జర్మన్ భాషా పరిజ్ఞానం మరియు సాంస్కృతిక అవగాహన అవసరాన్ని ప్రస్తావిస్తూ, జర్మన్ రాష్ట్రాలతో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి మరియు ఇంటిగ్రేషన్ రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని మంత్రి ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఇప్పటికే లోయర్ సాక్సోనీతో ఉన్న అవగాహన ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, బవేరియా సహా ఇతర రాష్ట్రాలతో కూడా సహకారం విస్తరించాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జోయాకిం హెర్మన్ భారత యువత ప్రతిభను ప్రశంసిస్తూ, తెలంగాణ–బవేరియా సంబంధాలను బలోపేతం చేయడంలో కిరణ్ కుమార్ వంగపల్లి చేసిన కృషిని అభినందించారు.
కార్యక్రమంలో ముఖ్య ఘట్టంగా మంత్రి వివేక్ వెంకటస్వామి, మేయర్ జోర్గ్ వోలెత్‌తో కలిసి ఎర్లాంగెన్ సిటీ గెస్ట్ బుక్‌పై సంతకం చేయడం జరిగింది. ఇది తెలంగాణ–జర్మనీ మధ్య పెరుగుతున్న సంబంధాలకు ప్రతీకగా నిలిచింది.
TIGER e.V. మరియు Germany_Lo_Telanganollam సంస్థలు కమ్యూనిటీ ఐక్యత, సాంస్కృతిక అనుసంధానానికి చేస్తున్న సేవలను మంత్రి అభినందించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రవాసులు మంత్రితో ప్రత్యక్షంగా ముచ్చటించి, తెలంగాణ–జర్మనీ సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు.
కార్యక్రమ నిర్వాహకుడు కిరణ్ కుమార్ వంగపల్లి, సుహాస్ మరియు రాహుల్ సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా Germany_Lo_Telanganollam తెలంగాణ–బవేరియా మధ్య అనుసంధానంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు