Sunday, April 19, 2026
Ad Banner

Nikhil Siddharth : 15న స్వయంభు నుంచి ‘రా రా ధీవర’ పాట విడుదల

Ra Ra Dheevra’ Song from Swayambhu Releasing on 15th”: ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్న నిఖిల్ సిద్ధార్థ, ఇప్పుడు తన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్వయంభు’తో రాబోతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో, పిక్సెల్ స్టూడియోస్‌ భువన్, శ్రీకర్‌ నిర్మాణంతో, టాగూర్ మధు సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని ఒక భారీ చారిత్రక యాక్షన్ చిత్రంగా తీర్చిదిద్దారు.రవి బస్రూర్ సంగీతం అందించగా, ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ‘రా రా ధీవర’ ఏప్రిల్ […]

Ra Ra Dheevra’ Song from Swayambhu Releasing on 15th”: ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్న నిఖిల్ సిద్ధార్థ, ఇప్పుడు తన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్వయంభు’తో రాబోతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో, పిక్సెల్ స్టూడియోస్‌ భువన్, శ్రీకర్‌ నిర్మాణంతో, టాగూర్ మధు సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని ఒక భారీ చారిత్రక యాక్షన్ చిత్రంగా తీర్చిదిద్దారు.రవి బస్రూర్ సంగీతం అందించగా, ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ‘రా రా ధీవర’ ఏప్రిల్ 16న విడుదల కానుంది.

ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు ఒక పవర్‌ఫుల్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పోస్టర్‌లో నిఖిల్ ఒక యోధుడి అవతారంలో, దట్టమైన అడవిలో నిలబడి, ఈటెను విసరడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనిపించారు. ఈ పాట ఎంత గ్రాండ్‌గా, అద్భుతంగా, కళ్లు చెదిరేలా ఉండబోతోందో ఈ పోస్టర్ సూచిస్తుంది.

RaRaDheevra
Swayambhu
SongRelease
TeluguSong
NewSong
MusicLaunch
TollywoodMusic
ComingSoon
April15Release
IndianMusic

ఇంతకుముందు విడుదలైన టీజర్, భారీతనం, విజువల్స్, ప్రపంచాన్ని ఆవిష్కరించిన తీరుకు అద్భుతమైన స్పందనను అందుకుని, సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది.పాత్రలో సహజంగా ఒదిగిపోవడానికి నిఖిల్ ఈ ప్రాజెక్ట్‌పై దాదాపు రెండు సంవత్సరాలు వెచ్చించి, ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. ఈ చిత్రంలో సంయుక్త,నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు.

సినిమాటోగ్రఫీ కేకే సెంథిల్ కుమార్ అందించారు. ఈ చిత్రానికిఎడిటర్: తమ్మిరాజు,మాటలు : విజయ్ కామిశెట్టి, యాక్షన్: కింగ్ సోలమన్, స్టంట్ సిల్వా, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు