Sunday, April 19, 2026
Ad Banner

Thimmaajupalli : “తిమ్మరాజుపల్లి టీవీ” ఫ్యూర్ సస్పెన్స్ డ్రామా: దర్శకుడు వి. మునిరాజు

“Thimmarajupalli TV – A Pure Suspense Drama”: న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా […]

“Thimmarajupalli TV – A Pure Suspense Drama”: న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు దర్శకుడు వి.మునిరాజు.

– దర్శకుడు కావాలనేది నా కల. ఇండస్ట్రీకి వచ్చాక జాబ్ కోసం ఆన్ లైన్ ఎడిటింగ్ చేయడం మొదలుపెట్టాను. కొంతకాలం ఆన్ లైన్ ఎడిటింగ్ చేస్తుంటే డైరెక్షన్ అనే కలకు దూరంగా ఉండిపోతున్నా అనిపించింది. దాంతో ఒక స్క్రిప్ట్ అనుకుని దాన్ని ఊరికి వెళ్లి అక్కడి వాళ్లతో డెమో షూట్ చేశాను. తిరిగొచ్చి ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ వర్స్క్ చేయించాను. ఆ తర్వాత మీటర్ మూవీ షూటింగ్ టైమ్ లో కిరణ్ అబ్బవరం గారు పరిచయం అయ్యారు. ఆయన ఏం చేస్తున్నావు అని అడిగారు. అలా మాటల్లో నా డెమో మూవీ గురించి చెప్పాను. ఆయనకు నచ్చి కథ ఏంటని అడిగారు. స్క్రిప్ట్ చెప్పాక పూర్తిస్థాయిలో డెవలప్ చేయి మనం మూవీ చేద్దామని అన్నారు. అలా “తిమ్మరాజుపల్లి టీవీ” మూవీకి తొలి అడుగులు పడ్డాయి

– “తిమ్మరాజుపల్లి టీవీ” కథకు స్పూర్తి నేను చిన్నప్పుడు చూసిన ఘటనలే. నేను చూసిన మనుషుల క్యారెక్టర్ లు, వారి భావోద్వేగాలు, నా చిన్నప్పటి అనుభవాలు ఇవన్నీ ఈ మూవీలో చిత్రీకరించాను. నేను తెరపై ఒక చెప్పాలనుకున్నప్పుడు అది నా ఊరి కథే ఎందుకు కాకూడదు అనిపించింది. మా ఊరికి మొదటిసారి టీవీ వచ్చినప్పుడు మాఊరికి దగ్గరలోని థియేటర్ కదిలి వచ్చిందా అనే భావన నాలో కలిగింది. ఇది ప్రతి ఊరి కథ. 40 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ టీవీ నేపథ్యంగా నేను చూసిన ఘటనలు చూసే ఉంటారు. ఊరి మనుషులు, వారి మధ్య అహం వంటి అంశాలు చూపిస్తూనే చివరలో మంచి ఎమోషనల్ కంటెంట్ చెబుతున్నాం.

Thimmarajupalli TV,Pure Suspense Drama,
Telugu Suspense Drama,
V Muniraju Director,
Mystery Thriller Telugu,
Suspense Short Film,
Telugu Thriller,
Village Mystery Story,
Crime Suspense Drama,
Indian Suspense Film,
Psychological Thriller Telugu,
Dark Mystery Drama,
Thimmarajupalli TV,
Pure Suspense Drama,
Telugu Suspense Drama,
V Muniraju Director,
Mystery Thriller Telugu,
Suspense Short Film,
Telugu Thriller,
Village Mystery Story,
Crime Suspense Drama,
Indian Suspense Film,
Psychological Thriller Telugu,
Dark Mystery Drama,

– ఈతరం జెన్ జీ కిడ్స్ కు కూడా మా సినిమా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈతరం పిల్లలకు అప్పటి మన కల్చర్,సంప్రదాయాలు తెలియవు, అప్పుడు మనమంతా ఎలా ఉండేవాళ్లమో తెలియదు. కాబట్టి మా సినిమాలోని వాతావరణం అంతా వాళ్లకు కొత్తగా ఉంటుంది. ఈతరం పిల్లలు చూడని ప్రపంచం, చూడని విషయాలు మా మూవీలో ఆకట్టుకుంటాయి.

– ఫ్యూర్ సస్పెన్స్ డ్రామా చిత్రమిది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నెక్ట్స్ ఏం జరుగుతుంది అని సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూస్తారు. చివరకు మంచి ఎమోషనల్ ఫీల్ తో థియేటర్ నుంచి బయటకు వస్తారు.రాయలసీమ నేపథ్యంగా కథ సాగుతుంది. మా ఊరు తిమ్మరాజుపల్లి. అదే ఊరిలో రియల్ లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. మీరు చూసే పాటలన్నీ మా ఊరు చుట్టుపక్కల రూపొందించినవే.

– రియలెస్టిక్ అప్రోచ్ తో ఈ సినిమాను తెరకెక్కించాను. కమర్షియల్ సినిమాల మేకింగ్ స్టైల్ వేరు. నేను సాధ్యమైనంత సహజంగా, అలాంటి వాతావారణంలో సినిమాను తెరకెక్కించాను. సైరత్, జునూన్ లాంటి మరాఠీ చిత్రాలు నాకు ఇష్టం. అలాగే సత్య చిత్రాన్ని కనీసం వందసార్లు చూసి ఉంటా. మేకింగ్ పరంగా మా మూవీ సర్ ప్రైజ్ చేస్తుంది. ఆరేడు నిమిషాల సింగిల్ టేక్ సీన్స్ చేశాం. కిరణ్ అబ్బవరం లాంటి ప్రొడ్యూసర్ దొరకడం నాకే కాదు మా టీమ్ అందరి అదృష్టం. ఇలాంటి చిన్న చిత్రానికి ఇంత మంచి రిలీజ్ ఇస్తున్నారు. నన్ను కిరణ్ గారు చాలా బిలీవ్ చేశారు. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకంతో మరింత బాధ్యతగా సినిమాను తెరకెక్కించాను. కంటెంట్ బాగున్న ఎన్నో చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. కొత్త వాళ్లం మేము చేసిన ఈ సినిమా న్యూ ఏజ్ ఫిలిం మేకింగ్ గా పేరు తెచ్చుకుంటుంది.

– మా మూవీలో నటించిన వారిలో ఏపీ తెలంగాణ నుంచి పలు జిల్లాల నుంచి వచ్చిన వారున్నారు.సురభి వంటి నాటకాల నుంచి వచ్చిన ఆర్టిస్టులున్నారు. ఈ సినిమా నాలాంటి ఎంతోమంది కొత్త వాళ్ల కల.మా మూవీ సక్సెస్ అయితే మరింతమంది కొత్త వాళ్లను నిర్మాతలు నమ్మే పరిస్థితి ఏర్పడుతుంది. అవకాశాలు పెరుగుతాయి. మా సన్నిహితులు, తెలిసిన వాళ్ల కోసం కొన్ని షోస్ వేసుకున్నాం. మూవీ చూసినవాళ్లందరికీ నేను చెప్పాలనుకున్న పాయింట్ కనెక్ట్ అయ్యింది.

– పర్ ఫార్మెన్ పరంగా ప్రతి ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు.హీరో హీరోయిన్స్ సహా అందరి నటన ఆకట్టుకుంటుంది. మీకు మూవీలో ప్రతి ఒక్కరూ కీలకమైన క్యారెక్టర్ లాగే అనిపిస్తారు. అట్మాస్ సహా టెక్నికల్ గా క్వాలిటీగా మూవీ చేశాం. ప్రతి పాట దేనికది భిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నాను. ప్రస్తుతం ఐదారు కథలు సిద్ధం చేసుకున్నాను. మన చుట్టూ ఉన్నస్టోరీస్ ను తెరకెక్కించాలనేది నా కోరిక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు