Sunday, April 19, 2026
Ad Banner

Bad boy karthik : బ్యాడ్ బాయ్ కార్తీక్ అందరికీ నచ్చుతాడు: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో నాగశౌర్య

“Bad Boy Karthik Wins Everyone’s Hearts: Hero Naga Shaurya at Pre-Release Event” హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్బంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ హీరోయిన్ విధికి ఇది తెలుగులో ఫస్ట్ సినిమా. ఆమెకు ఇది […]

“Bad Boy Karthik Wins Everyone’s Hearts: Hero Naga Shaurya at Pre-Release Event”
హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ సందర్బంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ హీరోయిన్ విధికి ఇది తెలుగులో ఫస్ట్ సినిమా. ఆమెకు ఇది మంచి లాంచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీదేవితో పనిచేయడం చాలా మంచి అనుభవం. ఆమె ప్రభాస్ మొదటి సినిమాలో చేశారు, నాకు కూడా అలాంటి లక్ రావాలని కోరుకుంటున్నాను.

సాయికుమార్ , వెన్నెల కిషోర్ , సుదర్శన్ , సముద్రఖని ఇలా చాలా పెద్ద తారాగణం ఈ సినిమాలో ఉంది. డైరెక్టర్ రమేష్ చాలా కష్టపడి చేశారు. మా నిర్మాతలు చాలా కష్టపడి సినిమా తీశారు. వారికి మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను.

ఈ సినిమా అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది అని నమ్ముతున్నాను. ఏప్రిల్ 17న థియేటర్లలో సినిమా చూసి మీ అభిప్రాయం చెప్పండి అని అన్నారు. శ్రీదేవి విజయ్ కుమార్ మాట్లాడుతూ మా సినిమా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ఈ నెల 17న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా నిర్మాత శ్రీనివాస్ ఈ సినిమాను పూర్తి చేశారు.

Naga Shaurya,Bad Boy Karthik,
Pre Release Event,
Telugu Cinema,
Tollywood,
Movie Promotion,
Upcoming Telugu Movie,
Hero Speech,
Film Event,
South Indian Movies,
Naga Shaurya,
Bad Boy Karthik,
Pre Release Event,
Telugu Cinema,
Tollywood,
Movie Promotion,
Upcoming Telugu Movie,
Hero Speech,
Film Event,
South Indian Movies,

ఈ సినిమాతో ఆయనకు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఆయన మరిన్ని మంచి సినిమాలు తీయాలి. రసూల్ లేకపోతే ఈ జర్నీ ఇలా పూర్తి అయ్యేది కాదు. ఈ సినిమా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. నేనూ థియేటర్‌లో ఈ సినిమా చూడడానికి వెయిట్ చేస్తున్నాను అని చెప్పారు. నిర్మాత శ్రీనివాస్ చింతలపూడి మాట్లాడుతూ ప్రతి సినిమాలో చిన్న చిన్న కష్టాలు ఉంటాయి, వాటిని ఎదుర్కొంటేనే సక్సెస్ వస్తుంది. ఇది మా ఫస్ట్ సినిమా. మరిన్ని సినిమాలు చేయబోతున్నాం.

జూన్ లో మరో సినిమా మొదలుపెట్టబోతున్నాం. ఏప్రిల్ 17న మీరు ఒక మంచి సినిమా చూస్తారు. మాకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎంతో సపోర్ట్ చేశారని చెప్పారు. హీరోయిన్ విధి మాట్లాడుతూ ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. ఈ ఈవెంట్‌లో మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది.

శౌర్య నాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే శ్రీదేవికి థాంక్యూ సో మచ్. ఎంతో ప్రేమ, అభిమానం చూపించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకు ధన్యవాదాలు. ఏప్రిల్ 17న మా సినిమా రిలీజ్ అవుతుందన్నారు. నిర్మాత అశోక్, జీ స్టూడియోస్ గిరీష్, నటి ప్రియ, డీఓపీ రసూల్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు