జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు.

తాజాగా ఈ చిత్ర విశేషాల్ని పంచుకునేందుకు దర్శకురాలు మానస శర్మ మీడియాతో ముచ్చటించారు.
మాది శ్రీకాకుళం. నేను మొదటగా యూట్యూబ్‌లో ‘మ్యాడ్ హౌస్’ చేశాను. ఆ తరువాత ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి క్రియేటర్, రైటర్‌గా పని చేశాను. ఆ తరువాత ‘బెంచ్ లైఫ్’ సిరీస్‌ని చేశాను. ఇది నాకు నాలుగో ప్రాజెక్ట్. ఫాంటసీ, అడ్వెంచర్లతో తీసిన ‘రాకాస’ చాలా కొత్తగా ఉండబోతుంది.

రాకాసని ఫాంటసీ, అడ్వెంచర్, కామెడీ జానర్లో తీశాం. ఇప్పటికే అందరూ మా టీజర్‌ని చూసి ఉంటారు. కామెడి ప్రధాన అంశంగా, కొద్దిగా హారర్ ఎలిమెంట్స్‌తో పూర్తి ఫాంటసీ, అడ్వెంచర్‌గా ఈ మూవీని తీశాం. ‘రాకాస’ కథని ముందుగా నెట్ ఫ్లిక్స్‌లో సిరీస్ కోసం చెప్పాను. ఆ టైంలోనే ఈ కథను సంగీత్ విన్నారు. ఆయనకి కూడా కథ చాలా నచ్చింది.
అలా ఈ ప్రాజెక్ట్‌లోకి సంగీత్ వచ్చారు. సంగీత్ అద్భుతమైన నటుడు. మంచి వ్యక్తి. అతని కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నయన్ సారిక మంచి నటి. డైరెక్టర్ ఏం చెబితే అది చేస్తారు. ఆల్రెడీ నేను ఇది వరకే ఆమెతో పని చేసి ఉన్నాను. ఆమె టాలెంట్, యాక్టింగ్ చూసి ఈ చిత్రంలో పెట్టుకున్నాను.

మేం బడ్జెట్లోనే సినిమా తీయాలని అనుకున్నాం. అయితే ఏ మూవీకి అయినా సరే కొంచెం అటూ ఇటూగానే అవుతుంది. కానీ టీం అంతా ముందే అనుకుని ఉండటంతో చాలా వరకు లిమిట్‌లోనే ఉన్నాం. రాకాస’ సెకండాఫ్‌లో ఎక్కువగా వీఎఫ్ఎక్స్ ఉంటుంది. అందుకే మేం ముందుగా సెకండాఫ్ షూట్ చేశాం. ఒక పక్క వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతూ ఉంటే.. ఫస్ట్ హాఫ్‌ని షూట్ చేశాం. అలా మాకు టైం కలిసి వచ్చింది. నాకు హీరోయిన్ కావాలనే కోరిక లేదని ఒక ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు.

నేను ఎవరిని తొక్కి, ఎవరిని నొప్పించి ఈ స్థాయికి రాలేదని , స్వయం క్రుషితో వచ్చాను. ప్రస్తుతం కొన్ని కథలు, ఐడియాలు ఉన్నాయి. మా అమ్మమ్మ వల్ల విఠలాచార్య సినిమాలు ఎక్కువగా చూశానని చెప్పారు. విఠలాచార్య అంటే నాకు ఎంతో ఇష్టం అని ఆమె తెలిపారు.


