Gaddar Award Has Increased Responsibility – Vanajeevi Ramayya Actress Nagarani:తెలుగు సినీ కళామతల్లి ఎప్పుడు ఎవరికీ ఎలాంటి అవకాశం ఇస్తుందో ఎవరూ ఊహించలేరు. కొంతమంది ఎల్లా తరబడి ఎదురు చూసిన మంచి పాత్రలు లభించవు. కానీ కొంతమందికి అదృష్టం తలుపుతట్టినట్టు పాత్రలు వస్తుంటాయి. అలాంటి ఒక్క పాత్ర కోసమే హీరోయిన్లు, నటీమణులు ఎదురుచూస్తుంటారు. అలాంటి గొప్ప పాత్రలో నటించే ఛాన్స్ తనకు రావడం జీవితంలో మరచిపోలేని అనుభూతిగా మిగిలిందని అంటోంది హీరోయిన్ నాగరాణి రెడ్డి. వనసంపదని ప్రేమించి , వనసంపద కోసమే జీవించిన వ్యక్తి వనజీవి రామయ్య. ఆయన జీవిత కథను ‘వనజీవిరామయ్య’ పేరుతోనే దర్శకుడు వేము సినిమాగా రోపొందించారు. ఈ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గద్దర్ అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరించింది.

ఇందులో వనజీవి రామయ్యగా నటుడు బ్రహ్మాజీ నటించగా, ఆయనకు భార్య జానకమ్మగా నాగరాణి రెడ్డి చక్కటి పాత్రను పోషించింది. ఈ సినిమాకు గద్దర్ అవార్డు వచ్చిన సందర్బంగా నాగరాణి రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఎలాంటి పాత్రకైనా ప్రాణం పోసే ప్రతిభ ఉన్న నాగరాణి రెడ్డి ఇంతకు ముందు పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాను. అయితే ప్రభుత్వం గుర్తించి గద్దర్ అవార్డు ఇవ్వడం అనేది జీవితంలో కొత్త అనుభూతినిచ్చింది.

తెలుగు సినీ, వెబ్‌సిరీస్, ప్రకటనల రంగాలలో తన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణి నాగరాణి రెడ్డి ఎనిమిదేళ్ల ప్రయాణంలో తన ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. వివిధ రకాల పాత్రలను సమర్థంగా పోషిస్తూ, నటిగా తన ప్రత్యేక శైలిని నిర్మించుకున్నారు. నా సినీ జీవితంలో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రం “వనజీవి రామయ్య”. ఈ చిత్రంలో నేను పోషించిన జానకమ్మ పాత్ర ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా అద్భుతంగా మలిచారు.

పాత్రలోని భావోద్వేగాలను సహజంగా వ్యక్తపరచడం ద్వారా నటనలో ఉన్న లోతును చాటి చెప్పారు. ఈ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన గద్దర్ అవార్డు ప్రకటించడం ఆ చిత్ర బృందానికి మాత్రమే కాకుండా తన నటనా ప్రతిభకు కూడా లభించిన గొప్ప గౌరవంగా భావితశున్నాను. నటుడు బ్రహ్మాజీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అద్భుతమైన అనుభూతి. బ్రహ్మాజీ కేవలం కామెడీ పరమైన పాత్రలే కాదు భావోద్వేగ భరిత పాత్రను కూడా చాలా గొప్పగా చేశారు.

ఆయన దగ్గరి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మా సినిమా దర్శకుడు వేముగంటి ప్రతి సన్నివేశాన్ని , ప్రతి డైలాగును చాలా స్పష్టంగా వినిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి సన్నివేశాన్ని ఒక దృశ్య కావ్యంగా మలిచారని చెప్పవచ్చు. బల్లేపల్లి మోహన్ అందించిన సంగీతం , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సింప్లి సూపర్ అని చెప్పాలి. టైటిల్ సాంగ్ చాలా బాగుంటుంది. ఖమ్మం, హైదరాబాద్ లో ఎక్కడెక్కడైతే వనజీవి రామయ్య తిరిగారో అక్కడ షూటింగ్ చేశాము.

ప్రజల మధ్య ఉండే ప్రజల మనిషి గురించి సినిమా తీస్తుంటే ఎంతో మంచి మా సినిమా యూనిట్ ను గొప్పగా మెచ్చుకున్నారు. అసలు రామయ్య మీద సినిమా తియ్యాలని ఆలోచన రావడమే మా దర్శకుడు వేముగంటి వేసిన సక్సెస్ . ఇందులో నేను ఒక భాగస్వామి కావడం ఇంతకంటే ఒక నటిగా గొప్ప పాత్ర ఏముంటుంది ? అందుకే అంటున్న ఈ పాత్ర జీవితాంతం గుర్తుండి పోతుంది. ఈ సినిమాకు గద్దర్ అవార్డు రావడం నటిగా నాకు మరింత బాధ్యతను పెంచిందని భావిస్తున్న.

బంగార్రాజు , సార్, స్వాగ్ , హిట్-3, జితేందర్ రెడ్డి, రాబిన్ హుడ్, ఓం భీం బుష్, ఏజెంట్, వెయ్ దరువెయ్ , నీలకంఠ, జయహో రామానుజం , రజాకార్ వంటి చాలా సినిమాలో నటించాను. ఆయా సినిమాల్లో పాత్రలకు మంచి గుర్తింపు కూడా లభించింది. వెబ్‌సిరీస్‌లలో ఏ టి ఎం, ఆహ నా పెళ్ళంటా వంటి ప్రాజెక్ట్‌ల ద్వారా డిజిటల్ ప్రేక్షకులకు చేరువయ్యాను. ప్రతి పాత్రలో కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం తనను ప్రత్యేకంగా నిలబెడుతోంది.ప్రకటనల రంగంలోనూ నాగరాణి తన ప్రతిభను చాటారు. నిప్పో బ్యాటరీ, గ్రోమోర్ వారి ఎఫ్ 20 వంటి యాడ్స్ కూడా చేశాను.
ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ చిత్రంతో పాటు గోట్ , గీత ఆర్ట్స్ సినిమా,అన్నపూర్ణ ప్రొడక్షన్స్ లో వస్తున్న సినిమాల్లో నటిస్తున్నాను. చీకటి, కృష్ణం భజే, కథాకళి, బ్లాక్ అండ్ వైట్ వంటి వెబ్‌సిరీస్‌లతో ఆమె బిజీగా ఉన్నారు.కృషి, పట్టుదల, పాత్రలపై ఉన్న నిబద్ధత ఇవన్నీ నాగరాణి రెడ్డిని తెలుగు చిత్రసీమలో ఎదుగుతున్న ప్రతిభగా నిలబెడుతున్నాయి. ప్రత్యేకంగా “వనజీవి రామయ్య”లో జానకమ్మగా ఆమె చూపిన నటన, గద్దర్ అవార్డు గౌరవంతో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. భవిష్యత్తులో ఆమె మరిన్ని విశిష్ట పాత్రలతో ప్రేక్షకులను అలరిస్థానాన్ని నాగరాణి అంటోంది.



