Sunday, April 19, 2026
Ad Banner

Autogas Shortage: ఆటోగ్యాస్ కొరత అధిగమించడానికి ఉత్తమ్ చర్యలు

Effective Measures to Overcome Autogas Shortage సరఫరాల పెంపుకు కేంద్ర పెట్రోలియం,సహజ వాయువు మంత్రికి లేఖ హైదరాబాద్, మార్చి 31: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గ్యాస్ ఆధారిత వాహనాలకు గ్యాస్ కొరత ఉన్నందున ప్రత్యామ్నాయంగా ప్రజా రవాణా సేవలను మరింతగా విస్తరించేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఎల్.పి.జీ గ్యాస్ కొరతతో ఆటోలతో సహా గ్యాస్ ఆధారిత వాహనాలు ఎదుర్కొంటున్న ఇక్కట్లపై సోమవారం సాయంత్రం మంత్రి […]

Effective Measures to Overcome Autogas Shortage

  • సరఫరాల పెంపుకు కేంద్ర పెట్రోలియం,సహజ వాయువు మంత్రికి లేఖ

హైదరాబాద్, మార్చి 31: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గ్యాస్ ఆధారిత వాహనాలకు గ్యాస్ కొరత ఉన్నందున ప్రత్యామ్నాయంగా ప్రజా రవాణా సేవలను మరింతగా విస్తరించేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఎల్.పి.జీ గ్యాస్ కొరతతో ఆటోలతో సహా గ్యాస్ ఆధారిత వాహనాలు ఎదుర్కొంటున్న ఇక్కట్లపై సోమవారం సాయంత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖా అధికారులతో పాటు ఎల్.పి.జి గ్యాస్ సరఫరా చేస్తున్న ప్రధాన పంపిణీ దారులతో డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర,హైదరాబాద్ కలెక్టర్ హారిచందన లతో పాటు ఐ. ఓ.సి.ఎల్,గోగ్యాస్,ఫ్రెంచ్ కీ చెందిన టోటల్ ఎనర్జీ లతో పాటు సూపర్ గ్యాస్,ప్రమ్ గ్యాస్ తదితర సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రవైట్ సంస్థలతో ఏర్పడిన కొరతను భర్తీ చేయడానికి గాను ఐ. ఓ.సి.ఎల్,హెచ్.పి.సి.ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు రావాలన్నారు.వాహనాలకు సరఫరా చేసే ఎల్.పి.జి గ్యాస్ సరఫరాలో ఏర్పడ్డ సంక్షోబాన్ని నివారించేందుకు గాను సరఫరాలను పెంచాలని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖామంత్రి హార్డిప్ సింగ్ పూరీ కి లేఖ రాయలని పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.అదే సమయంలో గ్యాస్ ఆధారిత ఆటో సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత పరిస్థితిని పారదర్శకంగా వివరించాలని ఆయన సూచించారు.

గ్యాస్ ఆధారిత ఆటోలతో పాటు ఆటోలకు రోజువారీగా 202 మెట్రిక్ టన్నుల గ్యాస్ అవసరం ఉండగా అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడ్డ సంక్షోభంతో రోజు వారీగా 147 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉందన్నారు.రోజూ వారి లోటు 55 మెట్రిక్ టన్నులు ఉండగా ఆ కొరత మొత్తం ప్రవైట్ రంగంలో కనిపిస్తోందన్నారు.ఆటో ఎల్.పి.జి సరఫరాలో 75 శాతం వాటాను ప్రయివేటు సంస్థలు కలిగి ఉన్నాయన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం ఇప్పటికీ మెరుగైన సరఫరా చేస్తున్నాయన్నారు. ఐ.ఓ.సి.ఎల్ మాత్రమే తాను రోజు వారీగా సరఫరా చేస్తున్న 35 మెట్రిక్ టన్నుల కోటాను 23 ఔట్ లెట్ల ద్వారా సరఫరా చేస్తుందన్నారు.

సూపర్ గ్యాస్,గో గ్యాస్ ,టోటల్ ఎనర్జీ ,ప్రయిమ్ గ్యాస్ వంటి సంస్థలు మార్కెట్లో ప్రధాన పంపిణీ దారులుగా ఉన్నారని ఇందులో ప్రభుత్వ వాటా మొత్తం 25 నుండి 30 శాతం వరకే కలిగి ఉందన్నారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో 116 ఔటర్ రింగ్ రోడ్డు లోపట,బయట 27 తో కలిపి మొత్తం 143 ఉండగా అందులో 23 ఔట్ లెట్లు పనిచేయడం లేదన్నారు.

వాటిలో 17 నగరం నడిబొడ్డున ఉన్నాయన్నారు.అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడ్డ యుద్ద వాతావరణం ఇంధన వనరుల మీద కనిపిస్తుందని,ఎల్.పి.జి దిగుమతి చేసే నౌకలు రెండు నుండి మూడు రోజులు ఆలస్యంగా వస్తుండడంతో ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు.

ప్రవైట్ సంస్థలు కృష్ణపట్నం, మహారాష్ట్ర లోని జైఘడ్,ముంబై లతో పాటు తమిళనాడు రాష్ట్రల టెర్మినల్స్ నుంచి బల్క్ ఎల్.పి.జీ నీ సేకరిస్తున్నాయన్నారు.కొన్ని సంస్థలు ప్రత్యామ్నాయ అంతర్జాతీయ వనరులను పరిశీలిస్తున్నాయని అయితే ఖచ్చితమైన సమయం చెప్పలేమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు