The Role of Rajasthan’s People in the Nation’s Development is Remarkable: Governor Shiv Pratap Shukla
హైదరాబాద్, 30 మార్చి 2026:
దేశ వికాసంలో రాజస్థాన్ ప్రజల పాత్ర ఎనలేనిదని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. సోమవారం లోక్ భవన్ లో ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్ లో భాగంగా రాజస్థాన్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న రాజస్థాన్ వాసులు ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

వేడుకలకు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన సతీమణితో పాటుగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ దేశంలో సంస్కృతి, సాంప్రదాయాల పరంగా రాజస్థాన్ కు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు.భగవాన్ శ్రీ రాముడు, జన్మభూమి స్వర్గం కంటే మిన్న అని చెప్పారని.. వారి స్ఫూర్తితోనే రాజస్థాన్ ప్రజలు దేశ అభివృద్ధి, సాంస్కృతిక వికాసంకు గొప్ప సేవ చేస్తున్నారని గవర్నర్ కొనియాడారు.

గవర్నర్ సందేశం అనంతరం ఏర్పాటు చేసిన రాజస్థాన్ సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షకులను కట్టిపడేశాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ సంయుక్త కార్యదర్శి శశికిరణాచారి, ఇతర లోక్ భవన్ ఉన్నతాధికారులు, రాజస్థాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.



