Devotional film gali : సంధ్య ఫిలిం బ్యానర్ పై రాంప్రసాద్ గురజాడ, అంజలి రామవతు, శ్రీకాంత్ పెరుమండ్ల యస్. చంద్రకళ,చందా రోజారాణి, బివి సుబ్బారెడ్డి నటీనటులుగా నాటక రంగంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత, నంది గరుడ వంటి అవార్డులు పొందిన టి రాము దర్శకత్వంలో నిర్మాత చందా లక్ష్మీనారాయణ నిర్మించిన సోషియో ఫాంటసీ చిత్రం “గాలి”.
ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల చేసిన టీజర్, సాంగ్ లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు విడుదల చేయడానికి చెన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్బంగా నిర్మాత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నాకు సినిమా ఫీల్డ్ కొత్తయినా రాము గారు రాసుకున్న షోషియో ఫాంటషీ కథ నచ్చడంతో ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా మేము అనుకున్న దానికంటే బాగా వచ్చింది.

అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 17న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా గాలి చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నారు. చిత్ర దర్శకుడు రాము మాట్లాడుతూ కలి పురుషుడికి అమ్మవారికి మధ్య జరిగే భీకర పోరాటమే ఈ “గాలి” చిత్రం. సస్పెన్స్ తో సాగే ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

సోషియో ఫాంటసీతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు. ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం : తీడ రాము, ఎడిటర్ : వేణు చౌదరి,
కెమెరామెన్ : కే ప్రకాష్, సంగీతం : అనిల్ కుమార్ మద్రాసు.


