Sunday, April 19, 2026
Ad Banner

Lord Shiva : అందరూ చేరేది శివుడి దగ్గరికే

Everyone Ultimately Reaches Lord Shiva:శివుడు (సంస్కృతం: Śiva) హిందూ మతంలోని ప్రధాన దేవుడు మరో పేరు సదాశివుడు సృష్టిలోని అంతటికి మూల కారణం శివుడు త్రిమూర్తులలో ఒకరు. బ్రహ్మ విష్ణు శక్తులకు ఉద్భవించడానికి మూలకారకుడు పరమశివుడు మహా కాలునిగా బ్రహ్మ విష్ణుతో సహా సమస్త సృష్టిని తనలో ఐక్యం చేసుకొని నూతన సృష్టి ఉద్వావింప చేసేవాడే మహా కాలుడు సదాశివు శివుడు అనగా ఆది అంతం లేనివాడు శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని […]

Everyone Ultimately Reaches Lord Shiva:శివుడు (సంస్కృతం: Śiva) హిందూ మతంలోని ప్రధాన దేవుడు మరో పేరు సదాశివుడు సృష్టిలోని అంతటికి మూల కారణం శివుడు త్రిమూర్తులలో ఒకరు. బ్రహ్మ విష్ణు శక్తులకు ఉద్భవించడానికి మూలకారకుడు పరమశివుడు మహా కాలునిగా బ్రహ్మ విష్ణుతో సహా సమస్త సృష్టిని తనలో ఐక్యం చేసుకొని నూతన సృష్టి ఉద్వావింప చేసేవాడే మహా కాలుడు సదాశివు శివుడు అనగా ఆది అంతం లేనివాడు శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన బ్రహ్మ విష్ణువు కోరిక మేరకు త్రిమూర్తులలో చివరివాడైన శంకరునిగా ఉద్భవిస్తాడు. శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. శివుడు పశుపతిగాను, లింగం రూపంలోను సింధు నాగరికత కాలానికే పూజలందుకున్నాడు.నేటికీ దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. వేదాలలో శివుడు రుద్రునిగా పేర్కొన్నారు.

శైవంలో శివుని పరమాత్మగాను, ఆదిదేవునిగాను భావిస్తారు. అయితే స్మార్తం వంటి ఇతర హిందూ శాఖలలో దేవుని అనేక రూపాలలో ఒకనిగా పూజిస్తారు. వైష్ణవంలో శివుని విష్ణువు రూపంగా భావిస్తారు. శివుని ప్రత్యేకంగా ఆరాధించే హిందూ మతస్థులను శైవులంటారు. శైవం, వైష్ణవం, శాక్తేయం హిందూ మతంలోని మూడు ముఖ్యమైన సంప్రదాయాలు. వినాయకుడు, కుమార స్వామి, అశోక సుందరి, జ్యోతి, మానసలు పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

శివ శబ్ద అర్థాలు
శివుడు ఆద్యంతాలు లేని వాడు, అతిశయించువాడు (ఎక్కడి నుండైనా, ఎక్కడికైనా; ఏ కాలం నుండైనా, ఏ కాలానికైనా అవలీలగా పయనించువాడు), రూపాతీతుడు.అందుకే శివుని ఈ విధంగా స్తోత్రం చేశ్తారు.

వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణమ్
వందే పన్నగ భూషణం శశిధరం వందే పశూనాం పతిమ్
వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియమ్
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్

కంచి కైలాసనాథ ఆలయ శివలింగం

నటరాజ నృత్య భంగిమలో పరమ శివుడు
ఆది శంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషము లేని వాడు. అంటే ప్రకృతి యొక్క (సత్వ, తమో, రజో) గుణాలేవీ అంటని వాడు. అందుచేత శివనామస్మరణంతోనే సకలజనులని పరిశుద్ధం చేయువాడు. స్వామి చిన్మయానందుల వారి ప్రకారం శివుడు అనగా అనంత పరిశుద్ధుడు, ఏ గుణములు అతడిని కళంకితుడిని చేయలేని వాడు.

Lord Shiva
Mahadev
Shiva Devotional
Spiritual Journey
Hindu Devotion
Bhakti
Indian Spirituality
Shiva Quotes
Har Har Mahadev
Om Namah Shivaya

ప్రముఖ శివ దేవాలయాలు

రామనాథస్వామి లింగం – రామేశ్వరం
శ్రీశైల క్షేత్రం (మల్లికార్జున లింగం) – శ్రీశైలం
భీమశంకర లింగం – భీమా శంకరం
ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం – ఎల్లోరా
త్రయంబకేశ్వర లింగం – త్రయంబకేశ్వరం, త్రయంబకేశ్వరాలయం, నాసిక్
సోమనాథ లింగం – సోమనాథ్
నాగేశ్వర లింగం – దారుకావనం (ద్వారక)
ఓంకారేశ్వర-అమలేశ్వర లింగములు – ఓంకారక్షేత్రం
మహాకాళ లింగం – ఉజ్జయని
వైద్యనాథ జ్వోతిర్లింగం – చితా భూమి (డియోఘర్)
విశ్వేశ్వర లింగం – వారణాశి
కేదారేశ్వర – కేదారనాథ్
శ్రీ రాజ రాజేశ్వర స్వామి – వేములవాడ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు