“Deepa Keeps Following Him, Calling ‘Bava Bava’”: రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మారెమ్మ’. ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మారెమ్మ ఫస్ట్ సింగిల్ ‘బావ బావ’ సాంగ్ ని రిలీజ్ చేశారు.
ప్రశాంత్ ఆర్ విహారి స్వరపరిచిన ఈ పాటలో పల్లెటూరి మట్టి వాసనతో పాటు మోడరన్ మ్యూజిక్ లేయర్స్ మిళితమై ఎంతో మధురమైన అనుభూతిని కలిగిస్తోంది ప్లజెంట్ ఫీల్‌ను అందించేలా ఈ పాట సాగే తీరు ఆకట్టుకుంటుంది. కమల్ ఎస్లవత్ లిరిక్స్ బావపై ఉన్న ఆప్యాయతను ఎంతో సింపుల్‌గా, హృదయానికి దగ్గరగా వ్యక్తపరుస్తాయి. శృతి రంజని తన స్వరంలో ఉన్న నేచురల్, రస్టిక్ టచ్‌తో పాటకు మరింత ప్రాణం పోసింది.మాధవ్, దీపా బాలు మధ్య కనిపించే సహజమైన కెమిస్ట్రీ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వారి యాక్టింగ్‌లో ఉన్న సహజత్వం, పల్లెటూరి అందమైన లోకేషన్స్ కలిసి విజువల్స్ ట్రీట్ గా మార్చాయి.

Deepa,
Bava Bava,
Telugu drama,
Emotional scene,
Love & affection,
Romantic pursuit,
Telugu serial scene,
Drama clip,
maremma movie ,
madhav ,
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ప్రశాంత్ అంకిరెడ్డి అందించగా, సంగీతాన్ని ప్రశాంత్ ఆర్ విహారి సమకూర్చారు. ఎడిటర్‌గా దేవ్ రాథోడ్, ఆర్ట్ డైరెక్టర్‌గా రాజ్‌కుమార్ మురుగేసన్ పని చేస్తున్నారు.ఈ సినిమా విడుదల తేదీ త్వరలోనే ప్రకటించనున్నారు. మాధవ్, దీపా బాలు, వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, రూపా లక్ష్మి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉమేష్ విలాసాగరం, డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి, ఎడిటర్: దేవ్ రాథోడ్, ఆర్ట్ డైరెక్టర్: రాజ్ కుమార్ మురుగేషన్, యాక్షన్ డైరెక్టర్: మాడిగొండ నటరాజ్, కొరియోగ్రాఫర్: సాగ్గీ సాగర్, సాహిత్యం: మిట్టపల్లి సురేందర్, కమల్ ఎస్లావత్.


