Music Director of Anand–Godavari Returns to Work After 10 Years: తిరువీర్ హీరోగా, ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పాపం ప్రతాప్’. కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. వరుస బ్లాక్ బస్టర్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్న ఈటీవి విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి రాబోతున్న ఈ సినిమా ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో పిల్ల ఎక్కడుంది సాంగ్ ని రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ కేఎం రాధకృష్ణ అద్భుతమైన మాస్ కంపోజ్ చేసిన ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ్ ఆకట్టుకునే సాహిత్యం అందించారు. రామ్ మిర్యాల వోకల్స్ సాంగ్ ఎనర్జీని మరింత పెంచాయి.. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ని నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో హీరో తిరువీర్ మాట్లాడుతూ గత సంవత్సరం మా బుజ్జమ్మ నన్ను వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇరుగుపొరుగు వారు, ఊర్లో వాళ్లు ఎన్నో విధాలుగా నన్ను విమర్శించారు. అందరూ “పాపం ప్రతాప్” అని మాత్రమే అన్నారు… కానీ నా సమస్యకు పరిష్కారం చెప్పిన వాళ్లు ఎవరూ లేరు. ఈ నెల 17వ తేదీన నా “బుజ్జమ్మ”తో మీ ముందుకు, మీ ఊర్లో థియేటర్లలో వస్తాను. నా సమస్య ఏమిటి? దానికి పరిష్కారం ఏమిటి? అన్నది మీకు చూపిస్తాను. ఇప్పటివరకు “పాపం ప్రతాప్” అన్నవాళ్లతో “వీర ప్రతాప్” అనిపించుకుంటాను. ఏప్రిల్ 17న మీరు “వీర ప్రతాప్”ని చూస్తారు.

డైరెక్టర్ నరేష్ ఈ కథ చెప్పిన దానికంటే అద్భుతంగా సినిమా తీశారు. అనుభవమున్న నిర్మాతలు, అలాగే ఈటీవీ విన్ టీమ్ మాకు అండగా ఉన్నారు. అందికే “ఫ్రీ వెడ్డింగ్” కంటే నాలుగు రెట్లు ఎక్కువ నమ్మకంతో ఉన్నాను. అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకు ఒక మంచి, కొత్త రోల్ చేసే అవకాశం వచ్చింది. ఈ టీమ్‌తో పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది.మ్యూజిక్ డైరెక్టర్ కె.ఎం. రాధాకృష్ణ మాట్లాడుతూ దాదాపు పది సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ మంచి ప్రాజెక్ట్‌తో వచ్చాను. ఇది నాకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
డైరెక్టర్ నరేష్ ఎంతో కష్టపడి ఈ సినిమా తీశారు. నాకు మళ్లీ మంచి పాటలు చేసే అవకాశం వచ్చింది. “ఆనంద్”, “గోదావరి”, “చందమామ” లాంటి ఫీల్ మళ్లీ ఈ పాటల్లో కనిపిస్తుంది.“ పిల్ల ఎక్కడ ఉంది” లాంటి మాస్ సాంగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన సాహిత్యం అందించారు. ఈ సినిమాతో మళ్లీ ఒక మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.ఈ ప్రెస్ మీట్ లో ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి, డైరెక్టర్ దుర్గా నరేష్, ప్రసాద్ బెహరా, ప్రొడ్యూసర్ రుద్రదేవ్, ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.


