My Favorite Bike Was Sold Without My Knowledge – Hero Rajasekhar:శర్వానంద్ శర్వా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన రేసింగ్ డ్రామా ‘బైకర్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో రాజశేఖర్ మీడియా చిట్ చాట్ నిర్వహించారు.
చాలా రోజుల తర్వాత నేను చేసిన సినిమా రిలీజ్ అవుతోంది. నేను బాగా ఇష్టపడి చేసిన సినిమా బైకర్. ఎప్పుడు ఏప్రిల్ 3న వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది చాలా ఆనందంగా ఉంది. నేను నటించిన సినిమా ఇది. నా సినిమాలానే ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఆడియన్స్ ఎంతలా మెచ్చుకుంటారు? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నేను ఏ క్యారెక్టర్ చేసిన అది బాగుండాలి, నాకు నచ్చాలి. అప్పుడే నేను చేయగలుగుతాను. అలాగే క్యారెక్టర్ బాగుంటే సరిపోదు. సినిమా కూడా అద్భుతంగా ఆడాలి. కథ బాగుండాలి. నేను బైకర్ కథ విన్నప్పుడు నా క్యారెక్టర్, కథ రెండు నచ్చే ఈ సినిమా చేశాను. బైకర్ కథ పరంగా సూపర్ గా హిట్ అవుతుంది. అలాగే నా క్యారెక్టర్ కూడా అద్భుతంగా వచ్చింది. సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

నాకు చిన్నప్పటినుంచి బైక్స్ అంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మ ఇంట్లో ఒక బుల్లెట్ బండి ఉండేది. నేను సెలవుల్లో అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఆ ఊరు మొత్తం బుల్లెట్లో తిరిగేవాడిని. ఆ తర్వాత బైక్స్ మీద ఆసక్తి పెరుగుతూ వచ్చింది. శేషు సినిమా సమయంలో స్వయంగా నేనే యమహా సిక్స్ ఫిఫ్టీ సిసి బండి కొనుక్కొని ఆ షూటింగ్ కి వాడడం జరిగింది. ఆ తర్వాత అదే బైక్ ని రోజు నడుపుకునేవాడిని. నేను నడిపే విధానం చూసి ‘మీరు చాలా రిస్క్ తో నడుపుతున్నారని నాకు తెలియకుండానే జీవిత ఆ బైక్ అమ్మేశారు బైకర్ లో నా క్యారెక్టర్ పేరు బుల్లెట్ సునీల్. ఈ క్యారెక్టర్ గురించి పూర్తి వివరాలు మీరు సినిమాలోనే చూడాలి.అభిలాష్ చాలా మంచి డైరెక్టర్. ఒక యాక్టర్ నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ కావాలో ఆయనకి చాలా క్లారిటీ ఉంటుంది. ఆయన కథ మీద క్యారెక్టర్ మీద చాలా గ్రిప్ ఉన్నా దర్శకుడు . ఆయన అనుకునది వచ్చేంతవరకు ఎక్కడ కూడా రాజీపడరు. చాలా ఇన్వాల్వ్మెంట్ ఉన్న డైరెక్టర్.ఈ క్యారెక్టర్ కి సంబంధించి ఆయన ప్రతి విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు.

ఈ సినిమాలో నన్ను చాలా కొత్తగా చూపించారు. డైరెక్టర్ విజన్. కథ వల్లే అది సాధ్యపడింది. సినిమా చూసిన ప్రేక్షకులు కచ్చితంగా నా క్యారెక్టర్ ని అభినందిస్తారు.ఇందులో బైక్ రేసింగ్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఒక హాలీవుడ్ రేంజ్ సినిమాలా ఉంటుంది. అలాగే ఫాదర్ సన్ ఎమోషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి.నేను నా డైలాగ్ నా క్యారెక్టర్ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. అందరం మంచి కొలీగ్స్, ఫ్రెండ్స్ లాగా వర్క్ చేసాము.రిలీజ్ రోజు అందరితో కలిసి థియేటర్ లో చూడాలని వెయిట్ చేస్తున్నాను.యూవీ క్రియేషన్స్ అంటే రాయల్ ట్రీట్మెంటు. ఎక్కడ ఖర్చుకి వెనకాడరు. ఈ సినిమాని హాలీవుడ్ క్వాలిటీతో తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సబ్జెక్టు కోసం క్వాలిటీ కోసం ఎక్కడ రాజీ పడకుండా ఖర్చు చేశారు. ఈ విషయంలో వారిని అభినందించాలి.

తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధించి వాళ్ళు పెట్టిన ఖర్చు తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది.నాకు ఫ్యామిలీ ఎప్పుడు కూడా బిగ్గెస్ట్ స్ట్రెంత్. ఈ సినిమా, నా క్యారెక్టర్ ఇంత అద్భుతంగా రావడానికి ఒక కారణం జీవిత, మా పిల్లలు. వాళ్ల సపోర్టు చాలా గొప్పది. ఈ సినిమా నేను చేసినప్పుడు నన్ను స్కూల్ కి డ్రాప్ చేసి మళ్లీ అక్కడి నుంచి తీసుకొచ్చే ఒక మదర్ లాగా చూసుకున్నారు.మా పాషన్, ప్రొఫెషన్ రెండు సినిమానే. ఇంట్లో మొత్తం సినిమా వాతావరణమే ఉంటుంది. కొత్త సినిమాలు రిలీజ్ అయితే నేరుగా థియేటర్స్ కి వెళ్లి చూస్తుంటాం. అలాగే ఏదైనా కథ క్యారెక్టర్ వస్తే అందరం కలిసి డిస్కస్ చేస్తాం.
అలాగే షూటింగ్లో జరిగిన విశేషాలు కూడా మాట్లాడుకుంటుంటాం. మేమందరం కూడా సినిమా ప్రొఫెషన్ లోనే ఉన్నాం కాబట్టి చాలా కంఫర్ట్ ఉంటుంది.పవన్ సాదినేనితో ‘మగాడు’ అనే సినిమా చేస్తున్నాను. అలాగే నేను, రమ్య, విశ్వదేవ్, శివాని కలిసి ఒక సినిమా చేస్తున్నాం. అది షూటింగ్ జరుగుతుంది త్వరలోనే టైటిల్ రిలీజ్ చేస్తాం. బైకర్ తో పాటు ఈ రెండు సినిమాలు కూడా కచ్చితంగా నా కెరీర్లో చాలా మంచి సినిమాలు అవుతాయని నమ్మకం ఉంది.


