Sunday, April 19, 2026
Ad Banner

nagabandham : జూలై 3న వస్తున్న ‘నాగబంధం’

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మైథలాజికల్ ఎపిక్ చిత్రం ‘నాగబంధం’. నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూలై 3న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈ మేరకు విడుదల తేదీ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రెండు రకాల గెటప్స్‌లో హీరో కనిపిస్తున్నారు. పై భాగంలో శివుడిగా హీరోగా పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. […]

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మైథలాజికల్ ఎపిక్ చిత్రం ‘నాగబంధం’. నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూలై 3న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈ మేరకు విడుదల తేదీ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రెండు రకాల గెటప్స్‌లో హీరో కనిపిస్తున్నారు. పై భాగంలో శివుడిగా హీరోగా పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక కింది భాగంలో మోడ్రన్ లుక్‌లో చాలా స్టైలిష్‌గా లక్కిచ్చారు ఈ రెండు లుక్స్‌తో డిజైన్ చేసిన పోస్టర్ ఆడియెన్స్‌‌లో మరింత క్యూరియాసిటీని పెంచేస్తోంది.ఈ చిత్రం ఇప్పటికే ఆడియెన్స్‌లో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ఫస్ట్ గ్లింప్స్, భక్తి గీతం ‘నమో రే’ ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేయడంతో టీం ప్రమోషన్స్ మీద ఫోకస్ పెట్టనుంది. విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, రిషబ్ సాహ్ని, జగపతి బాబు, గరుడ రామ్, మహేష్ మంజ్రేకర్, జయప్రకాష్, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్, బిఎస్ అవినాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం జునైద్ కుమార్ అభే,మాటలు కళ్యాణ్ చక్రవర్తి, ఎడిటర్: ఆర్‌సి ప్రణవ్, కొరియోగ్రఫీ బృందా, గణేష్ ఆచార్య, శ్రస్తి వర్మ,సాహిత్యం: కాసర్ల శ్యామ్, కళ్యాణ్ చక్రవర్తి, శ్రీహర్ష ఈమని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు