Sunday, April 19, 2026
Ad Banner

thiruveer : ఓ..! సుకుమారి’ షూటింగ్ పూర్తి

“Oh..! Sukumari Shooting Completed”: యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమ గత చిత్రాలతో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి విలేజ్ ఎంటర్టైనర్ ‘ఓ.! సుకుమారి’ చేస్తున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. తొలి సినిమా ‘శివం భజే’ తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్ కి మంచి […]

“Oh..! Sukumari Shooting Completed”: యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమ గత చిత్రాలతో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి విలేజ్ ఎంటర్టైనర్ ‘ఓ.! సుకుమారి’ చేస్తున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. తొలి సినిమా ‘శివం భజే’ తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఒక ఫోటో రిలీజ్ చేశారు. రజాకార్, పోలిమేర చిత్రాలకు సినిమాటోగ్రఫీ చేసిన సి.హెచ్. కుషేందర్ ఈ చిత్రానికి కెమెరామ్యాన్. ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం సమకూరుస్తారు.

బలగం ఫేం తిరుమల ఎం. తిరుపతి ఆర్ట్ డైరెక్టర్‌, క చిత్రానికి ఎడిటింగ్ చేసిన శ్రీ వరప్రసాద్ ఎడిటర్‌. స్వయంభు చిత్రానికి పని చేస్తున్న అను రెడ్డి అక్కటి ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్. పాపులర్ లిరిక్ రైటర్ పూర్ణచారి ఈ చిత్రంలోని పాటలు రాస్తున్నారు.ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రానికి డీవోపీ: CH కుషేందర్, సంగీతం: భరత్ మంచిరాజు, ఆర్ట్ డైరెక్టర్: తిరుమల ఎం తిరుపతి , ఎడిటర్: శ్రీ వరప్రసాద్, కాస్ట్యూమ్ డిజైనర్: అను రెడ్డి అక్కటి, లిరిక్స్: పూర్ణాచారి,ఫైట్స్ : అంజి, కొరియోగ్రఫీ: జెడి మాస్టర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు