Paapam Prathap Trailer Launch by Naresh: తిరువీర్ హీరోగా, ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పాపం ప్రతాప్’. కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిధిలుగా హాజరైయ్యారు.
ఈ సందర్బంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ పాపం ప్రతాప్’ను ఏప్రిల్ 17న తప్పకుండా చూస్తాను. రాధాకృష్ణ తెలుగుపై మంచి పట్టు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఈ సినిమాతో మళ్లీ రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకకు నేను రావడానికి కారణం తిరువీర్. నాకంటే నా వైఫ్ ఆయనకు ఫ్యాన్. మేము ఇంట్లో ఎప్పుడూ “సమోసా తింటావా శిరీష” అని సరదాగా మాట్లాడుకుంటాం ‘ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాకి ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారు. అది చాలా మంచి సినిమా. ఆయనకు ఇండస్ట్రీలో ఎప్పుడూ నా సపోర్ట్ ఉంటుంది అని అన్నారు.
డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ ట్రైలర్ చూస్తుంటే తిరువీర్ కంటే ప్రతాప్ క్యారెక్టర్ ఎక్కువగా కనిపించింది. డైరెక్టర్ నరేష్‌కు తెలుగు, కథపై మంచి పట్టు ఉందని ఈ ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. చాలా అద్భుతంగా తీశారు. నరేష్ కి సినిమా అంటే ప్యాషన్. ఇవివి సత్యనారాయణ నాకు పెద్ద ఇన్స్పిరేషన్. ఆయన సినిమాలు చూడకపోతే నేను ఇండస్ట్రీకి వచ్చేవాడిని కాదు. నరేష్ ని ఎప్పుడైనా కలిసినా ఆయన నాన్న గుర్తొస్తారు. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ పుష్కలంగా ఉందని నమ్ముతున్నాను. ‘పాపం ప్రతాప్’ జనాలను థియేటర్లకు రప్పిస్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా టికెట్ ₹100 లోపే ఉంది. ఈ బంపర్ ఆఫర్ మళ్లీ దొరకదు. అందరూ ఏప్రిల్ 17న థియేటర్లలో సినిమా చూడాలని కోరుతున్నాను.

హీరో తిరువీర్ మాట్లాడుత. ‘ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాకి మీడియా ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోను. అజయ్ ఘోష్ ఈ సినిమాలో మా తండ్రి పాత్రని చాలా సహజంగా చేశారు. ‘పాపం ప్రతాప్’ సినిమా ఇవివి సత్యనారాయణ సినిమాలా అనిపిస్తుంది. “మగాడు అంటే ఏడవకూడదు, బాధపడకూడదు” అంటారు. కానీ మగాడు కూడా మనిషే.. ఆ భావాన్ని ఈ సినిమాలో గొప్పగా చూపించారు. క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది. ఏప్రిల్ 17న మీ దగ్గరలోని థియేటర్లకు వస్తాను అని అన్నారు.


