Rise of the Allu Business Empire : పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన అల్లు అర్జున్ తన సినిమాలపై ఎలా ఫోకస్ పెడుతున్నాడో , వ్యాపార రంగంపై కూడా అదే స్థాయిలో ఫోకస్ పెడుతున్నాడు. ఏషియన్ గ్రూప్స్ తో చేతులు కలపిన అల్లు ఫ్యామిలీ అమీర్ పెట్ సత్యం థియేటర్ ను తమ వ్యాపారంలో ఒక భాగాన్ని చేసుకున్నారు. ఏఏఏ పేరుతో అమీర్ పెట్ లో థియేటర్స్ నడుస్తుంటే , తాజాగా కోకాపేట లో అల్లు థియేటర్ ను ఇటీవల ప్రారంభించారు.
డాల్బీ సిస్టం తో కూడిన లేటెస్ట్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. దీంతో అల్లు వారి వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తోందని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా ప్రదర్శనకు కావలసిన సాంకేతిక పరిజ్ఞ్యానాన్ని అందిస్తూ వ్యాపారం చేస్తున్న అల్లు ఫ్యామిలి ఇప్పుడు థియేటర్స్ పై ద్రుష్టి పెట్టి , అత్యున్నత సాంకేతిక విలువలతో తమ వ్యాపారాన్ని విస్తహరిస్తున్నారని చర్చ జరుగుతోంది. ఏదేమైన అల్లు అర్జున్ కెరీర్ అన్ని రకాలుగా పుష్పకు ముందు, పుష్ప తరువాత అనే స్థాయిలో మారిపోయిందని చెప్పడం అతిశయోక్తి కాదు.


