Sunday, April 19, 2026
Ad Banner

rk deeksha : సెన్సార్ కార్యక్రమాల్లో  ఆర్ కే దీక్ష

RK deeksha going to release very soon : ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌‌లో డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శక నిర్మాతగా డి ఎస్ రెడ్డి సమర్పణలో ఢీ, జోడి ఫేమ్ అక్సఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్ గా, కిరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం “ఆర్ కే దీక్ష”. ఈ చిత్రంలో తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక,  రోహిత్ శర్మ ఇతర కీలక పాత్రలు పోషించారు. “ఆర్ కే దీక్ష” సినిమా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు […]

RK deeksha going to release very soon : ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌‌లో డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శక నిర్మాతగా డి ఎస్ రెడ్డి సమర్పణలో ఢీ, జోడి ఫేమ్ అక్సఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్ గా, కిరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం “ఆర్ కే దీక్ష”. ఈ చిత్రంలో తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక,  రోహిత్ శర్మ ఇతర కీలక పాత్రలు పోషించారు. “ఆర్ కే దీక్ష” సినిమా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తామని దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో
హీరోయిన్ అక్సాఖాన్ మాట్లాడుతూ  “ఆర్ కే దీక్ష” మూవీలో నటించే అవకాశం కల్పించిన రామకృష్ణ గౌడ్ కి థ్యాంక్స్. ఈ మూవీ తర్వాత వీరి కాంబినేషన్ లోనే మహిళా కబడ్డీ మూవీ చేస్తున్నాను. “ఆర్ కే దీక్ష” సినిమాలో నంది నంది అనే సాంగ్ చేశాను.ఈ పాట నంది అవార్డ్స్ నేపథ్యంగా సాగుతుంది. ఈ పాట మీ అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. మా చిత్రానికి మీ సపోర్ట్ అందించాలని కోరుకుంటున్నా అన్నారు.
నటి తులసి మాట్లాడుతూ  నేను ఈ చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించాను. ఈ మూవీలో అక్సాఖాన్, అలేఖ్యరెడ్డి కాంబినేషన్ లో నా సీన్స్ ఉంటాయి. “ఆర్ కే దీక్ష” సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.
చిత్ర సమర్పకులు డీఎస్ రెడ్డి మాట్లాడుతూ దీక్ష పట్టుదలగా పనిచేస్తే ఏదైనా సాధించగలం అనే మంచి సందేశాన్నిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వాళ్లు తమ పర్ ఫార్మెన్స్ లతో మిమ్మల్ని ఆకట్టుకుంటారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన జవాన్లను కీర్తిస్తూ ఒక మంచి దేశభక్తి గీతాన్ని మా సినిమాలో రూపొందించాం. త్వరలోనే ఈ చిత్ర రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం అన్నారు.
దర్శకనిర్మాత డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ  మా “ఆర్ కే దీక్ష” సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ పనులు జరుగుతున్నాయి.సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాకుండా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేం కాబట్టి ఆగాం. త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తాం. నిర్మాతగా నాకు ఇది 44వ సినిమా, దర్శకుడిగా 9వ సినిమా. ఈ చిత్రంలో నాలుగు ఫైట్స్, నాలుగు సాంగ్స్ ఆకట్టుకుంటాయి.ఫైట్స్ రవి మాస్టర్ అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేశారు. అలాగే సాంగ్స్ లో ఒక పాట స్పెషల్ గా మన జవాన్ల ధైర్యసాహసాలను త్యాగాన్ని చెబుతూ రూపొందించాం. ఆ పాటను మధుప్రియ పాడింది. అలాగే నంది నంది అనే పాటలో అక్సాకాన్ డ్యాన్సులు హైలైట్ అవుతాయి. ఆమె డ్యాన్సులతో పాటు ఫైట్స్ కూడా చేసింది.
ఈ సినిమా నిర్మాణంలో డీఎస్ రెడ్డి మాకు సపోర్ట్ గా నిలిచారు. విలన్ గా జమ్మూ కాశ్మీర్ కు చెందిన రోహిత్ శర్మ నటిస్తున్నారు. పలు ఇంజినీరింగ్ కాలేజ్ లు, రామానాయుడు స్టూడియోలో చేసిన సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. ఈ చిత్రంతో కిరణ్, అక్సా ఖాన్, అలేఖ్య రెడ్డి, తులసి అందరికీ మంచి పేరుస్తుంది. దీక్ష సినిమా రిలీజ్ అయ్యాక మహిళా కబడ్డీ మూవీ స్టార్ట్ చేస్తాం. అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు