Monday, April 20, 2026
Ad Banner

Varuntej: కమ్సాహంనిదా పాట రిలీజ్

“Kamsaaham Nida – Telugu Lyrical Video: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది, మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం, భారతీయ, కొరియన్ నేపథ్యాలలో హారర్, కామెడీ,క్రాస్ కల్చర్ మేళవింపుతో ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఈ క్యారెక్టర్ కోసం అద్భుతమైన మేకోవర్ అయిన వరుణ్ తేజ్, మునుపెన్నడూ చూడని పాత్రతో ప్రేక్షకులను సర్ […]

“Kamsaaham Nida – Telugu Lyrical Video: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది, మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం, భారతీయ, కొరియన్ నేపథ్యాలలో హారర్, కామెడీ,క్రాస్ కల్చర్ మేళవింపుతో ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఈ క్యారెక్టర్ కోసం అద్భుతమైన మేకోవర్ అయిన వరుణ్ తేజ్, మునుపెన్నడూ చూడని పాత్రతో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చిత్ర బృందం ఇప్పుడు ఈ ఫస్ట్ మొదటి సింగిల్ ‘కమ్సాహంనిదా’ను విడుదల చేసింది.

ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ పాట రితికా నాయక్ సరదాగా ‘కమ్సాహంనిదా’ అని పలకడంతో ప్రారంభమవుతుంది. దానికి అర్థం ఏమిటని వరుణ్ తేజ్ ఆసక్తిగా అడుగుతాడు. కొరియన్ భాషలో ‘ధన్యవాదాలు’ అనే సమాధానం చెప్పడం, వారి మధ్య ఉన్న ప్రేమకు చక్కటి నాంది పలుకుతుంది. ఈ పాటను సున్నితమైన కొరియన్ టచ్స్, ఆకట్టుకునే మెయిన్‌స్ట్రీమ్ ఎలిమెంట్స్ తో మేళవించి అద్భుతంగా కంపోజ్ చేశారు. కాసర్ల శ్యామ్ రచన కొత్త ప్రేమలోని అమాయకత్వాన్ని ప్రజెంట్ చేయగా, సిద్ శ్రీరామ్ సాఫ్ట్ వోకల్స్ ఎమోషన్ ని మరోస్థాయికి తీసుకువెళ్తుంది.

Kamsaaham Nida
Kamsaham Nida song
Telugu song 2026
New Telugu songs
Telugu latest songs
Tollywood music
Telugu lyrical video
Love song Telugu
Romantic Telugu song
Telugu melody songs
South Indian songs
Telugu video song
Trending Telugu songs
Telugu music lovers
New Tollywood songs

యాష్ మాస్టర్ రూపొందించిన కొరియోగ్రఫీ పాటలోని హ్యాపీ వైబ్‌ను ప్రజెంట్ చేస్తూ విజువల్‌గా ఆకట్టుకుంటుంది.ఈ పాట సినిమా ప్రమోషన్స్‌కు సరైన జోష్ ఇచ్చింది. ఇందులో ప్రేమతో పాటు వినోదం కూడా ఉండబోతుందనే సంకేతాలు ఇస్తుంది. ఇప్పటికే వరుణ్ తేజ్ పుట్టినరోజున రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ వైరల్ అయింది. “కొరియన్ కనకరాజు” అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా హారర్-కామెడీగా అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వబోతుంది.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ మనోజ్ రెడ్డి కటాసాని అందిస్తుండగా, ఎడిటింగ్ సత్యా జి నిర్వహిస్తున్నారు.షూటింగ్ దాదాపు పూర్తికావడంతో మేకర్స్ త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి డీఓపీ మనోజ్ రెడ్డి కాటసాని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు