“₹10 Crore Fraud Case Filed Against Mangli in Panjagutta”: ఆంధ్రప్రదేశ్ కు చెందిన గాయని , ఫోక్ డ్యాన్సర్ మంగ్లీ అలియాస్ సత్యవతి పోలీసు విచారణ ఎదుర్కోబోతున్నారు. హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మంగ్లీ తో పాటు మరో నాలుగురిపైన కేసు నమోదైంది. పదికోట్ల మేర మోసం చేశారని, మోసం చేసిన వారిలో మంగ్లీ తోపాటు ఆమె సోదరుడు కూడా ఉన్నాడని ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

మైక్రో ఫైనాన్స్ పేరుతో పదికోట్ల రూపాయలు మోసం చేయడంతో పాటు డబ్బులు అడిగినందుకు బెదిరిస్తున్నారని సుబ్బారావు అనే న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరి నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగ్లీ, ఆమె సోదరుడితోపాటు మరో ముగ్గురిపై బీఎన్‌ఎస్ సెక్షన్ 351 (2), 352 కింద కేసు నమోదు చేశారు. మంగ్లీ, ఆమె సోదరుడు శివ, మరికొంత మంది కలిసి సుమారు 100 మంది నుంచి భారీగా నిధులు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసులో ఏ5 గా మంగ్లీ పేరును చేర్చారు.
నాకేమి సంబంధం లేదు : వేణు ఉడుగుల

మంగ్లీ పై పెట్టిన కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని రాజు వెడ్స్ రాంబాయి సినిమా నిర్మాత వేణు ఉడుగుల పేర్కొన్నారు. ఈ వ్యవహారమంతా జరిగిన మాట తనకు కొంతవరకు తెలుసునని, అయితే ఈ విషయంలో తనపై కూడా ఆరోపణలు రావడంతో నేను వెళ్లి పోలీసులకు అసలు విషయాన్నీ చెప్పానని వేణు చెప్పారు. దీంతో ఈ కేసులో తన ప్రమేయం ఏమిలేదని తెలుసుకున్న పోలీసులు తనపియా కేసు నమోదు చెయ్యలేదని , ఎఫ్ ఐ ఆర్ లో తన పేరును ప్రస్తావించలేదని వేణు తెలిపారు. మీడియా వారు తన పేరిట ఎఫ్ ఐ ఆర్ బుక్ అయినట్టు వార్తలు రాస్తున్నారని , ఈ విషయాన్నీ మీడియా గమనించి వార్తలు రాయాలని వేణు అడుగుల కోరారు.


