Monday, April 20, 2026
Ad Banner

Harudu:యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘హరుడు’: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో వెంకట్

Harudu’ as an Action Entertainer: Hero Venkat at the Trailer Launch Event:శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు లాంటి సినిమాలతో అలరించిన హీరో వెంకట్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తున్నారు. విఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ హీరోగా రూపొందుతున్న మాస్ కమర్శియల్ ఎంటర్ టైనర్ ‘హరుడు’. రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సమ్మర్ స్పెషల్ గా మే 8న ఈ సినిమా వరల్డ్ […]

Harudu’ as an Action Entertainer: Hero Venkat at the Trailer Launch Event:శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు లాంటి సినిమాలతో అలరించిన హీరో వెంకట్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తున్నారు. విఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ హీరోగా రూపొందుతున్న మాస్ కమర్శియల్ ఎంటర్ టైనర్ ‘హరుడు’. రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సమ్మర్ స్పెషల్ గా మే 8న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ సందర్బంగా హీరో వెంకట్ మాట్లాడుతూ ‘హరుడు’ సినిమాను పూర్తి చేయడానికి నేను యాక్టింగ్‌తో పాటు ప్రొడ్యూసర్ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వచ్చింది. చాలా మంచి నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇందులో విలన్‌గా శ్రీహరి పైలా అనే కొత్త ఆర్టిస్ట్‌ను పరిచయం చేస్తున్నాం. ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. మణి జిన్న అద్భుతమైన మ్యూజిక్ అందించారు.

ఒక రొమాంటిక్ సాంగ్‌ను గోవాలో షూట్ చేశాం ఆ పాట చాలా బాగా వచ్చింది. మాస్ సాంగ్ కూడా చిత్రీకరించాం అది థియేటర్లలో అలరిస్తుంది. మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. గోవా, ముంబైలో పాటలు చిత్రీకరించాం అని అన్నారు. డైరెక్టర్ రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ ఇది పూర్తిగా టీమ్ వర్క్. ఈ సినిమా కోసం వెంకట్ ప్రాణం పెట్టి పనిచేశారు. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టం. ముంబైలో ఐదు రోజుల షూటింగ్ చాలా మంచి అనుభవం. హెబ్బా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. కథ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పారు.

కమెడియన్ అలి మాట్లాడుతూ వెంకట్‌తో ‘సీతారామ కళ్యాణం’ సినిమా నుంచి పరిచయం ఉంది. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. అప్పటి నుంచి మా జర్నీ కొనసాగుతోంది. ఆయన నిర్మించిన ఒక సినిమాలో కూడా నేను నటించాను. అన్ని భాషల్లో సినిమాలు చేసిన వెంకట్ ఇప్పుడు ‘హరుడు’తో వస్తున్నారు. ఆయన యాక్షన్ చాలా బాగుంటుంది. రాజ్ తాళ్లూరి పూరి జగన్నాథ్ దగ్గర పని చేశారు. ఆ మార్క్ కనిపిస్తోంది. మే 8న ఈ సినిమా వస్తోంది అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు