Don Bosco Shooting Completed: రాధా కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్, విదేశాల్లో అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను విజయవంతంగా డిస్ట్రిబ్యూట్ చేసి తనదైన గుర్తింపు తెచ్చుకున్న సంస్థ రాధాకృష్ణ ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు కామెడీ ఎంటర్‌టైనర్ ‘డాన్ బోస్కో’ సినిమాను నిర్మాత వెంకట్ ఉప్పుటూరి రూపొందిస్తున్నారు. హీరో రుష్య దత్త ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకంది.
జైలర్, నా సామి రంగ సినిమాలతో గుర్తింపు పొందిన అందాల నటి మిర్నా మీనన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. శనివారం మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో రుష్య దత్త చాలా స్టైలిష్‌గా కనిపిస్తూ, ఒక చేతిలో కటానా లాంటి కత్తిని పట్టుకుని, మరో చేతితో కాలర్‌ను పైకెత్తుతూ బోల్డ్ పోజ్‌లో కనిపిస్తున్నారు.
ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘ప్రతి రీయూనియన్ జ్ఞాపకాల కోసమే కాదు.. కొన్ని విముక్తి (రిడెంప్షన్) కోసం కూడా ఉంటాయి’ అనే క్యాప్షన్ మరింత ఎగ్జైట్‌మెంట్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఇందులో మురళీ శర్మ ప్రిన్సిపాల్ విశ్వనాథ్ పాత్రలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మిర్నా మీనన్ లెక్చరర్ సుమతి పాత్రలో కనిపించనుంది.
మౌనిక, రాజ్‌కుమార్ కాసిరెడ్డి, విష్ణు ఓయ్ తదితరులు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కచ్చితంగా ఈ మూవీ మంచి ఎంటర్‌టైనర్‌గా మెప్పించనుందనే హమీ కలుగుతోంది. శంకర్ గౌరి రైటర్, డైరెక్టర్‌గా వర్క్ చేస్తోన్న ఈ ఎంటర్‌టైనర్‌కు ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ అందించగా శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు.


