Sunday, April 19, 2026
Ad Banner

Akhil akkineni : ‘ఎట్టా ఎట్టా’ అంటున్న అఖిల్ అక్కినేని

akhil akkineni release etta etta song from lenin :హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇటీవ‌ల విడుద‌లైన తొలి సాంగ్ ‘వారేవా వారేవా..’కు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. త‌మ‌న్ సంగీత సారథ్యంలో విడుదలైన ఈ సాంగ్‌తో మూవీ ప్ర‌మోష‌న్స్ షురూ అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎట్టా ఎట్టా..’ అనే సాంగ్ రెండో పాట‌గా విడుద‌లైంది. చ‌క్క‌టి […]

akhil akkineni release etta etta song from lenin :హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇటీవ‌ల విడుద‌లైన తొలి సాంగ్ ‘వారేవా వారేవా..’కు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. త‌మ‌న్ సంగీత సారథ్యంలో విడుదలైన ఈ సాంగ్‌తో మూవీ ప్ర‌మోష‌న్స్ షురూ అయ్యాయి.

తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎట్టా ఎట్టా..’ అనే సాంగ్ రెండో పాట‌గా విడుద‌లైంది. చ‌క్క‌టి మ్యూజిక్ ట్రాక్‌తో ఈ పాట‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ జోష్‌తో నిండిన డాన్స్ మెలోడీ క్యాచీ బీట్స్, ఎనర్జీతో మెప్పిస్తోంది. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే మధ్య ఉండే కెమిస్ట్రీ ఈ పాటకు హైలైట్. అఖిల్ తన మాస్ స్టెప్స్‌తో అదరగొడుతుంటే, భాగ్యశ్రీ తన చార్మ్‌తో స్క్రీన్‌పై మెప్పిస్తోంది. ఈ ఇద్ద‌రి జోడీని స్క్రీన్‌పై చూస్తుంటే చాలా ఎన‌ర్జిటిక్‌గా ఉంది. త‌న‌దైన సిగ్నేచ‌ర్ హుక్స్‌, బీట్స్‌తో సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ మాస్ మెలోడీని అద్భుతంగా కంపోజ్ చేశారు.

akhil akkineni bhagyasri borse, etta etta song
akhil akkineni bhagyasri borse, etta etta song

సింగ‌ర్ శ్రీకృష్ణ‌తో క‌లిసి త‌మ‌న్ ఈ పాట‌ను పాడ‌టం విశేషం. భాస్క‌ర‌భ‌ట్ల ట్యూన్‌కు త‌గ్గ‌ట్టు చ‌క్క‌టి సాహిత్యాన్ని అందించారు. ప్ర‌తీ ప‌దం వినసొంపుగా లోక‌ల్ ట‌చ్‌తో రొమాంటిక్ స్టైల్లో ఉన్న‌ట్లు అనిపిస్తోంది. ‘లెనిన్’ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బలమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే కథతో పూర్తి ఎంటటైన‌ర్‌గా రూపుదిద్దుకుంటోంది. అంద‌రూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న‌ ఈ చిత్రం జూన్ 26న థియేటర్లలో విడుదల కానుంది. ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా మేక‌ర్స్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు