sandeep kishan new movie titile power peta:హీరో సందీప్ కిషన్ చిత్ర పరిశ్రమలో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఒక మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రతిభావంతుడైన రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్యతో కొత్త చిత్రాన్ని చేయనున్నట్టు ప్రకటించారు. నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నేతృత్వంలోని ప్రతిష్టాత్మక బ్యానర్ 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘పవర్ పేట’ అనే టైటిల్ ఆసక్తికరంగా ఉంది. డార్క్, గ్రిట్టీ, సింబాలిజంతో నిండిన ఈ పోస్టర్‌లో రక్తంతో తడిసిన చెస్ బోర్డు కనిపిస్తుంది. ఇది వ్యూహం, శక్తి, త్యాగాన్ని సూచించే క్లాసిక్ ప్రతీక. చెస్ పీసులు విరిగిపోయినవి, కూలిపోయినవి, అస్థిర విజయంతో నిలబడినట్లు కనిపిస్తాయి. ఆ గందరగోళం మధ్య నలిగిపోయిన ఒక గులాబీ పువ్వు, రక్తంతో ముద్రించబడి కనిపిస్తుంది.

ఈ విజువల్ సినిమా ప్రధాన అంశాలైన ప్రేమ, గౌరవం, రాజకీయాలను ప్రతిబింబిస్తూ, భావోద్వేగాలు, పవర్ ఫైట్స్ కథను సూచిస్తోంది. దర్శకుడు కృష్ణ చైతన్య విభిన్న జానర్లను కలిపి ఒక పవర్ ఫుల్ కథను రూపొందించారు.
సంగీతాన్ని మణిశర్మ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను మధీ నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. రామకృష్ణ, మోనిక ప్రొడక్షన్ డిజైన్‌ను చూసుకుంటున్నారు. సౌండ్ డిజైన్‌ను సచిన్ సుధాకరన్, హరిహరన్ రూపొందిస్తున్నారు.సినిమా గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.


