Tuesday, April 21, 2026
Ad Banner

Kalagamanam : 17న ‘కాలగమనం’ విడుదల

Grand Pre-Release Event of Kalagamanam – Worldwide Theatrical Release on the 17th:పిపిఆర్ ఫిలిమ్స్ పతాకంపై రాజా బిరుదుల, లావణ్య రామారావు, చినబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “కాలగమనం”. సుధాకర్ బుర్రి దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తోన్న ఈ లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రం ఈనెల 17న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.ఈ సందర్బంగా హైదరాబాద్ లో “కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. […]

Grand Pre-Release Event of Kalagamanam – Worldwide Theatrical Release on the 17th:పిపిఆర్ ఫిలిమ్స్ పతాకంపై రాజా బిరుదుల, లావణ్య రామారావు, చినబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “కాలగమనం”. సుధాకర్ బుర్రి దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తోన్న ఈ లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రం ఈనెల 17న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.ఈ సందర్బంగా హైదరాబాద్ లో “కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ రాజ్ తేలు మాట్లాడుతూ “కాలగమనం” సినిమాను మా డైరెక్టర్ సుధాకర్ బుర్రి బ్యూటిఫుల్ గా తెరకెక్కించారు. నేను పోస్ట్ ప్రొడక్షన్ చేసే టైమ్ లో అనేక సార్లు ఈ చిత్రాన్ని చూశాను. నాకు బాగా నచ్చింది. ప్రేక్షకులు కూడా మా మూవీని ఇష్టపడతారని, సక్సెస్ చేస్తారని నమ్ముతున్నా అన్నారు.

నటుడు జబర్దస్త్ రాజమౌళి మాట్లాడుతూ – “కాలగమనం” చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్ లో నటించాను. కొత్తదనంతో ఉండే ప్రేమ కథా చిత్రమిది. వినోదంతో పాటు మంచి సందేశం కూడా మూవీలో ఉంటుంది. ఈ సినిమాను ఈ నెల 17న థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయాలని కోరుతున్నా అన్నారు.

హీరో రాజా బిరుదుల మాట్లాడుతూ “కాలగమనం” సినిమాలో హీరోగా నటించే అవకాశం కల్పించిన మా ప్రొడ్యూసర్, డైరెక్టర్ సుధాకర్ బుర్రి గారికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాం. ఒక మంచి సందేశం ఉన్న ప్రేమ కథా చిత్రమిది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. థియేటర్స్ లో మా మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు అన్నారు.

Grand Pre-Release Event of Kalagamanam – Worldwide Theatrical Release on the 17th
Grand Pre-Release Event of Kalagamanam – Worldwide Theatrical Release on the 17th

హీరోయిన్ లావణ్య రామారావు మాట్లాడుతూ మేమంతా కొత్త వాళ్లం. మాకు వచ్చే అవకాశాలు ఎంతో విలువైనవి. ఈ చిత్రంతో అలాంటి విలువైన అవకాశం మా డైరెక్టర్ సుధాకర్ కల్పించారు. మా మూవీ ఈ నెల 17న థియేటర్స్ లోకి వస్తోంది. మీరంతా సపోర్ట్ చేయాలి అని అన్నారు.

దర్శక,నిర్మాత సుధాకర్ బుర్రి మాట్లాడుతూ నేను గతంలో కొన్ని షార్ట్ ఫిలింస్ చేశాను. సినిమా మేకింగ్ మీద ప్యాషన్ పెరుగుతూ వచ్చింది. మాకున్న బడ్జెట్ లో ఒక మంచి కథను తెరకెక్కించాం. కంటెంట్ బాగుంటే చిన్న చిత్రానికైనా పెద్ద విజయాన్ని ప్రేక్షకులు అందిస్తున్నారు. ఈ మూవీ కంటెంట్ బాగుంది, అందుకే విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. యువతను ఆకట్టుకునే అంశాలు ఉంటూనే పెద్దల్ని కూడా ఆలోచింపజేచేసే చిత్రమిది అన్నారు.

ఈ చిత్రానికి
డిఓపి- మురళి కంకణాల,ఎడిటర్- శ్రీకృష్ణ ప్రసాద్,కాస్ట్యూమ్ డిజైనింగ్- శ్వేతా బొమ్మారెడ్డి, నిర్వహణ- పిల్లెం రామారావు , శ్రీకర్ బుర్రి
స్క్రిప్ట్, ప్రొడ్యూసర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు