King Buddha – We Want World Peace (Title Song):కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్ సినిమా టైటిల్ పాటను శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ శాఖ మంత్రి డాక్టర్ సునీల్ సేనేవి లాంచ్ చేశారు. ఇరాన్ – ఇజ్రాయిల్, ఉక్రెయిన్ – రష్యాతో పాటు 50 దేశాల్లో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని “కింగ్ బుద్ధ వుయ్ వాంట్ వరల్డ్ పీస్” అనే సినిమాను సత్యారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అమెరికాలో ప్రారంభించి థాయిలాండ్, మలేషియా, వియత్నం, కాంబోడియా, లావోస్, ఇండోనేషియా లాంటి బుద్దిస్ట్ దేశాల్లో షూటింగ్ జరిపామని ఈ సందర్బంగా సత్యా రెడ్డి చెప్పారు. . త్వరలో శ్రీలంక దేశంలో షూటింగ్ జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
ప్రపంచ చరిత్రలో ఇన్ని బౌద్ధ దేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఏకైక చిత్రంగా కింగ్ బుద్ధ నిలిచిపోతుందని ఆయన అన్నారు. అన్ని బౌద్ధ దేశాల సహాయ సహకారాలు ఈ చిత్రానికి అందిస్తారని ఆయన ఆశించారు. అనుబాంబు దాడులకు గురైన హీరోషిమా – నాగసాకి ఇప్పటికీ కోలుకోలేదని ఆయన గుర్తు చేశారు. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఉండాలన్న, ప్రపంచం శాంతి మార్గంలో నడవాలన్నా ప్రపంచానికి బుద్ధిజమే ఏకైక మార్గం అని ఆయన అన్నారు.
ప్రపంచ శాంతి కోసం ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది బౌద్ధ బిక్షువులు పీస్ వాక్ చేస్తున్నారని కోట్లాదిమంది ప్రజలు వారిని ఆదరిస్తున్నారని ఆయన అన్నారు. . 2027లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 100 భాషలకు పైగా విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఇంతవరకు రాని అత్యుత్తమ సాంకేతికను చిత్రానికి వాడుతున్నామని ఆయన తెలియజేశారు.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగులోని గౌతమ బుద్ధుని జననం, బాల్యం విద్యాభ్యాసానికి సంబంధించిన సన్నివేశాలు నేపాల్ దేశంలోని హిమాలయాలు, లుంబిని, ఘాట్మండు ప్రాంతంలో జరుగుతుందని ఆయన తెలియజేశారు. ప్రముఖ రచయిత విబూత్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.


