Sunday, April 19, 2026
Ad Banner

Pawan Kalyan Launches Bari:‘బరి’ సినిమాకు క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan Launches “Bari” Movie with First Clap :వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘బరి’. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను శనివారం నాడు నిర్వహించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.ముహూర్తపు సన్నివేశానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా మైత్రీ మూవీస్ […]

Pawan Kalyan Launches “Bari” Movie with First Clap :వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘బరి’. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను శనివారం నాడు నిర్వహించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.ముహూర్తపు సన్నివేశానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు మేర్లపాక గాంధీ, నిర్మాత రాజీవ్ రెడ్డి ఎదుగురు స్క్రిప్ట్ అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం యూనిట్ చిత్రానికి సంబంధించిన విశేషాల్ని పంచుకున్నారు.

Pawan Kalyan Gives First Clap for “Bari” Movie Launch
Pawan Kalyan Gives First Clap for “Bari” Movie Launch

ఈ సందర్బంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ ‘నా ‘ముకుంద’ సినిమా తరువాత మళ్లీ మా బాబాయ్ పవన్ కళ్యాణ్ ‘బరి’ చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆయన చేతుల మీదుగా సినిమా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. నిహారిక నిర్మాతగా నేను హీరోగా చేస్తుండం ఎంతో స్పెషల్‌గా అనిపిస్తుంది. మేం ఇద్దరం కలిసి ఇలా ఒక సినిమా చేయాలనే ఆలోచన ఉండేది కాదు. కానీ వంశీ తెచ్చిన స్క్రిప్ట్ మా ఇద్దరిని ఇలా కలిపింది. వంశీ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ టీం మీద ఉన్న నమ్మకంతోనే సినిమాకి ఓకే చెప్పాను. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. నేను కూడా వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్నాను. వచ్చే సంక్రాంతికి ‘బరి’ సినిమాని బరిలోకి దించబోతోన్నాం అని అన్నారు.

నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘మా నాన్న ఫ్యామిలీ మెంబర్లతో సినిమాలు తీశాడు. వాళ్ల అన్నయ్య, తమ్ముడితో సినిమాలు తీశారు. అలా ఫ్యామిలీ మెంబర్లతో చిత్రాలు నిర్మిస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు ఈ రోజు తెలుస్తుంది. మా అన్న వరుణ్‌తో మూవీని ఈ రోజు ప్రారంభించడం నాకు చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది. మా మూవీ ప్రారంభోత్సవానికి మా బాబాయ్ పవన్ కళ్యాణ్ రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతోన్నాం.

విలేజ్ డ్రామాగా, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో వంశీ ఈ సారి మరో అద్భుతమైన స్టోరీని చెప్పబోతోన్నారు అని అన్నారు. ఈ ప్రెస్ మీట్ యదు వంశీ, అనుదీప్ దేవ్ మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ర‌మేష్ మ‌న్యం, సినిమాటోగ్ర‌ఫీ: ధ‌నుష్ భాస్క‌ర్‌, మ్యూజిక్‌: అనుదీప్ దేవ్‌,ఎడిట‌ర్‌: అన్వ‌ర్ అలీ, ఆర్ట్‌: విష్ణు వ‌ర్ధ‌న్ పుల్ల‌, రైట‌ర్స్‌: వెంక‌ట సుభాష్ చీరాల‌, ఉత్త‌మ్ లెక్క‌ల‌, విక్కీ మా, రంజిత్ మారెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు