Sunday, April 19, 2026
Ad Banner

Raakasa: ‘రాకాస‌’ కు సింగిల్ స్క్రీన్స్ టికెట్ ధ‌ర‌ రూ.100

Single Screen Ticket Price for “Raakasa” is ₹100 : జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల ‘రాకాస’ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణ‌లో శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహా మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై విడుద‌లైన చిత్రం ఇప్ప‌టికే […]

Single Screen Ticket Price for “Raakasa” is ₹100 : జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల ‘రాకాస’ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న రిలీజ్ చేశారు.

ఏపీ, తెలంగాణ‌లో శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహా మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై విడుద‌లైన చిత్రం ఇప్ప‌టికే మంచి క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతూ దూసుకెళ్తోంది. ఈ సినిమాను ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ చేసే ప‌నిలో భాగంగా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లలో సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధ‌ర‌ను కేవలం రూ.100గా ఫిక్స్ చేశారు. దీంతో రాకాస చిత్రం సామాన్యుడికి మ‌రింత చేరువ కానుంది.

చ‌క్క‌టి అర్థ‌వంత‌మైన కామెడీతో ఈ సినిమా అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది. సంగీత్‌, గెట‌ప్ శీను ట్రాక్ ప్రేక్ష‌కుల‌కు చాలా బాగా క‌నెక్ట్ అయ్యింది. దీంతో పాటు వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్‌, న‌ట‌న‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తోంది. దీంతో ప్రేక్ష‌కులు ఈ స‌మ్మ‌ర్‌లో కుటుంబంతో కలిసి ఈ సినిమాను చూడ‌టానికి ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు. ఈ వంద రూపాయల ఆఫర్ ను సద్వినియోగపరచుకోవాలని నిర్మాత నిహారిక కొణిదెల తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు