Sunday, April 19, 2026
Ad Banner

sharvanand : బైకర్ తో మాట నిలబెట్టుకున్నాం: హీరో శర్వానంద్

We Kept Our Promise with the Biker: Hero Sharwanand: చార్మింగ్ స్టార్ శర్వా లేటెస్ట్ బంపర్ బ్లాక్ బస్టర్ బైకర్. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పాత్రని పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ యువీ క్రియేషన్స్ నిర్మాణంలో. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రేక్షకులు నుంచి విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ […]

We Kept Our Promise with the Biker: Hero Sharwanand: చార్మింగ్ స్టార్ శర్వా లేటెస్ట్ బంపర్ బ్లాక్ బస్టర్ బైకర్. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పాత్రని పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ యువీ క్రియేషన్స్ నిర్మాణంలో. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రేక్షకులు నుంచి విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్బంగా శర్వానంద్ మాట్లాడుతూ బైకర్ తెలుగు సినిమా గర్వపడేలా ఉంటుందని చెబుతున్నాను.ఆ మాట తప్పలేదు. అలాంటి మంచి ఫ్యామిలీ సినిమాను తీశాం. సినిమా అద్భుతంగా మౌత్ టాక్‌తో వెళ్తోంది. దానికి కారణం ఫ్యామిలీ ఆడియన్స్, యూత్. అభిలాష్ మంచి ఫాదర్ అండ్ సన్ స్టోరీ చెప్పాడు. ఇది చాలా ఎమోషనల్ మూవీ. నిజ జీవితంలో తండ్రి, కొడుకులు అలానే ఉంటారు. రాజశేఖర్ మాకు ఎప్పుడూ హీరోనే. ఆయన ఈ సినిమా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. రేసింగ్ సీన్స్ ఇంత అద్భుతంగా వచ్చాయంటే, అది మొత్తం టీమ్ ఎఫర్ట్. టెక్నికల్‌గా సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉందని ప్రశంసలు రావడానికి మా టీమ్ వర్క్ కారణం అన్నారు.

Sharwanand Biker Promise Telugu Movie News Tollywood Updates Actor Commitment Viral News Fan Interaction Telugu Cinema Hero Sharwanand News

డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ ఈ సినిమా ఇంత విజయం సాధించడానికి, నా క్యారెక్టర్‌కు మంచి పేరు రావడానికి కారణం అభిలాష్ రెడ్డి. శర్వానంద్ హీరోగా చేస్తున్న సినిమాలో నేను ఇంత మంచి క్యారెక్టర్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే శర్వా, మాళవిక ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. చాలా అద్భుతంగా నటించారని చెప్పారు.

డైరెక్టర్ అభిలాష్ రెడ్డి మాట్లాడుతూప్రీమియర్స్ నుంచే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమాను అభినందించారు. చూసిన వాళ్లందరూ కూడా ఇంత అద్భుతంగా ఎలా తీశారని అడుగుతున్నారు. టెక్నికల్‌గా సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలో రేసింగ్‌తో పాటు ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అవుతున్నారు. ఫాదర్ అండ్ సన్, వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషన్స్‌కు చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. మొదటి రోజు నుంచే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నారని తెలిపారు.

Sharwanand Biker Promise Telugu Movie News Tollywood Updates Actor Commitment Viral News Fan Interaction Telugu Cinema Hero Sharwanand News

హీరోయిన్ మాళవిక నాయర్ మాట్లాడుతూ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం ఏమీ చేయలేం. అదే పాయింట్‌తో ఈ సినిమాను మీ ముందుకు తీసుకొచ్చాం. ఎమోషన్‌కు ఆడియన్స్ చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు. సినిమాను చూసి మరో పదిమందికి చెప్పండి
అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు